మంగళవారంతో మొదలైన శనివారం

కొత్త సినిమా రిలీజ్ అవ్వకముందే, మరో కొత్త సినిమాను నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది కూడా. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి వచ్చింది.…

కొత్త సినిమా రిలీజ్ అవ్వకముందే, మరో కొత్త సినిమాను నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది కూడా. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి వచ్చింది.

నాని-వివేక్ ఆత్రేయ మరోసారి కలిసిన సంగతి తెలిసిందే. ఈసారి 'సరిపోదా శనివారం' అనే సినిమాను ప్రకటించారు. ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఓవైపు హాయ్ నాన్న ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని, 'సరిపోదా శనివారం'కు కూడా టైమ్ కేటాయించాడు.

యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ మూవీ కోసం మరోసారి రఫ్ లుక్ ట్రై చేస్తున్నాడు నాని. ఈరోజు నానితో పాటు, మరికొంతమంది ఫైటర్లపై యాక్షన్ బ్లాక్ తీశారు. కేవలం యాక్షన్ కే పరిమితం కాకుండా, కొంత టాకీ కూడా ఈ షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నారు.

ఈ సినిమాలో నానికి విలన్ గా ఎస్ జే సూర్య కనిపించబోతున్నాడు. భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమా కోసం అతడ్ని తీసుకొచ్చారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాడు సూర్య. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్.

'సరిపోదా శనివారం' సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ ఇదివరకే రిలీజైంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా రాబోతోందనే విషయాన్ని వెల్లడించారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.