పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో కి హాజరుకాబోతున్నారు. ఈ మేరకు ఆయన తన అంగీకారాన్ని తెలిపారని తెలుస్తోంది.
అన్ స్టాపబుల్ 2 షో కి పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని యూనిట్ చాలా పట్టుదలగా ప్రయత్నించింది. సెకండ్ సీజన్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ తో ఓ ఎపిసోడ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దాని కోసం గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికి అది ఓకె అయింది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 పెద్దగా క్లిక్ కాలేదు. సరైన గెస్ట్ లు దొరక్కపోవడమే కారణం. ఇటీవలే ప్రభాస్ తో ఓ ఎపిసోడ్ చేసారు. దాని కోసం మాత్రం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాని తరువాత జయసుధ, జయప్రద ఎపిసోడ్, ఆపై వీరనరసింహా రెడ్డి ఎపిసోడ్ వున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అన్నది సీజన్ 2 కి ముంగింపుగా వుంటుదని అనుకోవాల్సి వుంది.
అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లకు ఇద్దరేసి వంతున గెస్ట్ లను పిలుస్తున్నారు. ఈ లెక్కన పవన్ తో పాటు త్రివిక్రమ్ కూడా హాజరు కావాల్సి వుంటుంది. కానీ ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్నందున త్రివిక్రమ్ వస్తారా? జస్ట్ కొద్ది సేపు కనిపిస్తారా? అన్నది అనుమానంగానే వుంది. పవన్ కు ఇదే ఫస్ట్ చాట్ షో అవుతుంది. ఈ షోకి పవన్ రాబోతున్నారని అందరి కన్నా ముందుగా వెల్లడించింది గ్రేట్ ఆంధ్రనే..అదే ఇప్పుడు నిజమయింది.