పొలిటికల్ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరువాత సినీ జర్నలిస్ట్‌గా, పీఆర్ఓగా, శాటిలైట్ కన్స్ల్టెంట్గా సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన వ్యక్తి కె.రాఘవేంద్రరెడ్డి. ఆయన తన అనుభవాన్ని రంగరించి రాసిన కథతో తయారైన సినిమా ‘శాసనసభ’. ఇంద్రసేన కథానాయకుడిగా, వేణు మడికంటి దర్శకత్వంలో సప్పాని బ్రదర్స్ నిర్మించిన పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బఃగా రాఘవేంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు.
మొదట్నుంచి సినీ పరిశ్రమకు రచయితగా కావాలనే వచ్చాను.. అప్పటి నుంచి ప్రయ్నతం చేశాను. నా కెరీర్‌కంటే ఫ్యామిలీ కోసం రిస్క్‌తీసుకోవద్దని ఆగాను. ఇప్పుడు అంతా బాగుంది.. అందుకే నాలోని రచయిత కెరీర్‌ను ప్రారంభించాను. ఇక ఇప్పుడు ఈ కథ రాయడానికి కారణం హీరో ఇంద్రసేన. ఆయన నాకు మంచి ఫ్రెండ్ ఆయన కోసం రాసిన కథ. మొదట్లో ‘అసెంబ్లీ’ అనే అనే వర్కింగ్టైటిల్తో ఈ సినిమా ప్రారంభించాం.
రాజకీయాల్లో జరిగిన సంఘటనల స్ఫూర్తిగా తీసుకుని శాసనసభ కథను రాశాను. శాసనసభ అంటే పవిత్రస్థలం దానిని దేవాలయంగా భావించాలి. కానీ నేడు శాసనసభ వాల్యూ మసకబారుతున్నట్లు అనిపించింది. అందునే దాని వాల్యూను ఈ తరం వాళ్లకు తెలియజెప్పాలి అనే వుద్దేశంతో ఈ కథను రాశాను. శాసనసభ వాల్యూను పెంచే విధంగా కమర్షియలాలిటి యాడ్చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రంలో ఏ ఒక్క వ్యక్తులను టార్గెట్ చేయలేదు.కాని రాజకీయ వ్యవస్థలో వున్న లోటుపాట్లను డిస్కస్ చేశాం. ఓటు విలువ తెలియజెప్పడం కోసం చేసిన కథ. అందరికి బాధ అనిపించే ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మేము రాసిన కథకు కాకతాళియంగా సమకాలీన రాజకీయాలకు కుదిరాయి.
చెప్పాలనుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పాం. తప్పకుండా ఈ చిత్రం వల్ల ఒకరిద్దరు మారిన మా ప్రయత్నం సక్సెస్ అయినట్లే. ఇలాంటి కథ రాయడం గర్వంగా వుంటుంది.