ఉత్తరాంధ్రా నుంచి జగన్… ?

అదే నిజమైంతే ఇంతకంటే బాంబు లాంటి వార్త వేరొకటి ఉండదేమో. అయితే ఇది ప్రచారంలో మాత్రం ఉంది. జగన్ అంటే పులి వెందుల, జగన్ అంటే కేరాఫ్ కడప. వైఎస్సార్ ఫ్యామిలీకి ఇలా దశాబ్దాలుగా…

అదే నిజమైంతే ఇంతకంటే బాంబు లాంటి వార్త వేరొకటి ఉండదేమో. అయితే ఇది ప్రచారంలో మాత్రం ఉంది. జగన్ అంటే పులి వెందుల, జగన్ అంటే కేరాఫ్ కడప. వైఎస్సార్ ఫ్యామిలీకి ఇలా దశాబ్దాలుగా స్థిరమైన స్థావరంగా ఉన్న ప్రాంతమది.  వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి పోటీ చేయాలే కానీ గెలుపు లాంఛ‌నం అన్నది రూఢీ అయిన వాస్తవం.

అలాంటిది జగన్ లో రెండవ ఆలోచ‌న రెండవ చోటు నుంచి పోటీ అంటే నిజంగా పొలిటికల్ గా షాకింగ్ న్యూస్ గానే ఉంటుంది. అయితే జగన్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని ఒక సంచలన వార్త అయితే చక్కర్లు కొడుతోంది. 

ఇది ఎంతవరకూ వాస్తవం అని ఆలోచించినా లాజిక్ గా థింక్ చేస్తే మాత్రం కరెక్ట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే జగన్ ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద గట్టిగానే దృష్టి పెట్టారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినది జగన్.

అందువల్ల రానున్న ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రా నుంచి పోటీ చేసి తన చిత్తశుద్ధిని దృఢ సంకల్పాన్ని మరో మారు గట్టిగా చాటుకుంటారని అంటున్నారు. ఈ మేరకు ఉత్తరాంధ్రాకు చెందిన ఒక కీలక నేతతో జగన్ ఇదే విషయం ఇటీవల చర్చించారని టాక్ నడుస్తోంది. 

మొత్తానికి చూస్తే ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఉత్తరాంధ్రా నుంచి పోటీకి తయార్ అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జగన్ కూడా రెడీ అంటే మాత్రం ఏపీకి రాజకీయ రాజధాని ఏదో అంతా చెప్పకనే చెప్పేశారు అనుకోవాల్సిందే.