cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

రజనీ కాంత్...పెద్దన్న

రజనీ కాంత్...పెద్దన్న

ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్- డైరక్టర్ శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమాకు ఇప్పటికే క్రేజ్ వుంది. వింటేజ్ రజనీని మళ్లీ చూడబొతున్నారన్న టాక్ వుంది. 

రజనీ సవతి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా ఇది. అన్నాచెల్లెళ్ల అనుబంధం బ్యాక్ డ్రాప్ లో తయారైన కథ. 

ఈ సినిమా తెలుగు హక్కులను నారాయణ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు కలిపి 12 కోట్లకు కొనుగోలు చేసారు. ఈ సినిమాకు పెద్దన్న అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 4న విడుదలవుతోంది ఈ సినిమా. 

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దీపావళి కి మన దగ్గర పెద్ద సినిమాలు ఏవీ లేవు. పైగా అటు వారం ఇటు వారం పెద్ద సినిమాలు లేవు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు మాంచి క్రేజ్ ఏర్పడింది బయ్యర్ సర్కిళ్లలో. త్వరలో పొస్టర్ తో టైటిల్ ను అనౌన్స్ చేస్తారు. 

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×