సాధారణంగా వెబ్ మీడియాలో గ్యాసిప్ లు కనిపిస్తాయి. అయితే ప్రింట్ మీడియాలో కూడా పొలిటికల్ గ్యాసిప్ లు కనిపించడం ఏనాడో ప్రారంభమైంది. అయితే సంపాదకీయాలు, సీరియస్ పొలిటికల్ కామెంట్ కాలమ్స్ లో మాత్రం సీరియస్ డిస్కషన్, కామెంట్ వుంటాయి కానీ గ్యాసిప్ లకు చోటుండదు. కానీ అదేం జర్నలిజమో తెలియదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్తపలుకు కాలమ్ లో గ్యాసిప్ లు రాస్తూ, వాటిపై తన వ్యాఖ్యానం రాస్తుంటారు. జగన్ ను ఓ ఇండస్ట్రియలిస్ట్ ను డబ్బులు అడిగాడని తనకు తెలిసింది అంటూ గ్యాసిప్ రాయడం, దాని ఆధారంగా జగన్ పై బురద జల్లే కామెంట్లు చేయడం.
తాజాగా ఆయన పుట్టించిన గ్యాసిప్ కేసిఆర్ వెళ్లి అమిత్ షాను కలిస్తే, రాజీనామా చేసి, కేటీఆర్ ను సిఎమ్ ను చేయమని ఆయన అన్నారన్నది. ఎంత ప్యూర్ గ్యాసిప్ ఇది. అమిత్ షా.. కేసిఆర్ కలిస్తే ఆ ఇద్దరు తప్ప మరో వ్యక్తి వుండరు. ఈ విషయం బయటకు చెప్పాల్సి వస్తే అమిత్ షా చెప్పాలి. లేదా కేసిఆర్ చెప్పాలి. కేసిఆర్ అయితే తనను రాజీనామా చేసి కేటీఆర్ ను సిఎమ్ ను చేయమన్నారు అమిత్ షా అని ఎవ్వరికి చెప్పరు కదా? ఇక మిగిలింది అమిత్ షా. ఆయన ఎవరికి చెబుతారు? అలాంటి చౌకబారు పని ఆయన చేస్తారా?
అయినా తనుచూడని, తనకు తెలియని వ్యవహారం గురించి గ్యాసిప్ మాదిరిగా ఇంతలా రాసిన ఆర్కే, తను స్వయంగా అమిత్ షాను కలిసిన విషయాలు పూర్తిగా రాసి వుండొచ్చుగా. తన ఛానెల్ పై అప్రకటిత నిషేధం వ్యవహారం ప్రస్తావించడం, దానిపై అమిత్ షా స్పందన ఇలాంటివి కూడా డిటైల్డ్ గా చెప్పి వుండొచ్చు కదా? ఇదే మరో పత్రిక లేదా మాధ్యమం కూడా ఇదే విధంగా రాస్తే..
ఆర్కే రాతలు చదివి, తెలుసుకుని, చంద్రబాబే ఫోన్ చేసి మందలించారని లేదా తెలుగుదేశం నాయకులే అసహ్యించుకుంటున్నారని, తెలుగుదేశం ఓటమి రాధాకృష్ణే కారణమని తెలుగుదేశం నాయకులు బాహాటంగా చెప్పుకుంటున్నారని గ్యాసిప్ వండి వారిస్తే..
అమిత్ షాను కలిసినపుడు రాధాకృష్ణ తన ఛానెల్ అప్రకటిత నిషేధం గురించి ప్రస్తావిస్తే, ఆయన అస్సలు పట్టించుకోలేదని, పైగా చికాగ్గా మొహం పెట్టారని, ఆర్కే ఈ విషయం ప్రస్తావించగానే అమిత్ షా కుర్చీలోంచి లేచేసారని ఎవరైనా ఎవరైనా గ్యాసిప్ రాస్తే.. అందుకు సపోర్టింగ్ లాజికల్ పాయింట్ గా, అమిత్ షాను కలిసి ఇన్నాళ్లయినా సమస్య పరిష్కారం కాకపోవడాన్ని చూపిస్తే..
ఆర్కే ఫోన్ లో చంద్రబాబును పలకరిస్తే, తన కారణంగానే భాజపాకు విడాకులు ఇచ్చానని, తనమాట నమ్మే నిర్ణయాలు తీసుకున్నానని, తన కారణంగానే ఇప్పుడు ఓటమి పాలయ్యానని చంద్రబాబు కోపంగా మాట్లాడరని ఎవరైనా గ్యాసిప్ వండి వారిస్తే..
ఇలా ఎన్నిగ్యాసిప్ లైనా పుట్టించవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం గ్యాసిప్ రాయడం వేరు. అది పట్టకుని తానులకు తాన్లు కామెంట్లు రాసుకుపోవడం వేరు. ఆర్కే లాంటి పాపులారిటీ వున్న ఆర్కే గ్యాసిప్ లు పుట్టిస్తూ, వాటిని పట్టుకుని ఇలా చేయడం ఎంతవరకు సబబు? ఇది ఏ మేరకు జర్నలిజం అనిపించుకుంటుంది?
అందుకే జనం వీటిని పట్టించుకోవడం, నమ్మడం మానేసారు. పైగా ఆఫ్ ది రికార్డుగా తెలుగుదేశం పార్టీని ఆర్కే తన రాతల ద్వారా ఓటమి దిశగా నడిపించారని ఆ పార్టీ జనాలే కామెంట్ చేస్తున్నారు. ఈ సంగతి ఆర్కే ఎప్పుడు తెలుసుకుంటారో?