తను కరోనా వైరస్ బారిన పడినట్టుగా ప్రకటించుకున్నారు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ లో ప్రకటించుకున్నారు. ప్రస్తుతం తను ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతున్నట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన సూచిస్తూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే పలు దేశాల అధినేతలకు కరోనా సోకినట్టుగా వార్తలు వచ్చాయి. ఇండియాలో కేంద్ర హోం శాఖా మంత్రికి సోకింది ఈ వైరస్. కరోనా బాధితుల జాబితాలో చాలా మంది రాజకీయ నేతలు నిలుస్తూ ఉన్నారు. తమిళనాట ఒక ఎమ్మెల్యే కూడా కరోనాతో మరణించారు. యూపీలో ఒక మంత్రి కరోనాతో మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కరోనా వేళ కూడా రాజకీయ నేతలు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తుంటుంది. దీంతో వారికి ఈ వైరస్ సోకే అవకాశాలు పెరిగాయి.
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్ ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టుగా అమిత్ షా ప్రకటించుకున్నారు. తనతో ఇటీవలి కాలంలో సమావేశం అయిన వాళ్లు ఐసొలేషన్ తో ఉండాలని సూచించారు.