ఆ సామాజిక వర్గానికి రాజధానిగా అమరావతి కావాలి. కానీ వ్యాపారాలకు, రాజకీయాలకు మాత్రం విశాఖ కావాలి. ఉత్తరాంధ్రలో మైనింగ్ వ్యాపారం ఎవరిది? వేలాది కోట్లు అక్రమ మైనింగ్ చేసింది ఎవరు? ఇటీవల వంద కోట్ల వరకు ఫైన్ పడింది ఎవరికి? క్రషర్ల బిజినెస్ మొత్తం ఎవరి చేతిలోవుంది? చిరకాలం ఇటుకల వ్యాపారం చేసి, ఈ ప్రాంతపు మట్టిని దోచుకుని, నగదుగా మార్చుకున్నది ఎవరు?
చిరకాలంగా విశాఖ రాజకీయాలను శాసిస్తున్నది ఎవరు? విశాఖలో ఫ్లయ్ ఓవర్ల కాంట్రాక్టులు చిరకాలంగా ఎవరికి దక్కుతూ వస్తున్నాయి. విశాఖలో హోటల్ వ్యాపారం మొత్తం ఎవరి చేతిలో వుంది? విశాఖలో రియల్ ఎస్టేట్ బిల్టర్లు ఎవరు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. విశాఖ నుంచి అరకు వరకు, విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు వేలాది ఎకరాలు ఎవరిచేతిలో వున్నాయి.
విజయనగరం జిల్లాలో వందలాది ఎకరాలు చేతిలో వుంచుకుని కాయగూరలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నది ఎవరు? ఉత్తరాంధ్ర మొత్తం మీద రొయ్యలు, సీఫుడ్స్ బిజినెస్ ఎవరి చేతిలో వుంది? దశాబ్దాల కాలంగా విశాఖలో మొన్నటి వరకు లిక్కర్ సిండికేట్ లు ఎవరి ఆధీనంలో వున్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..ఎన్నెన్నో.. అంతెందుకు రాజధానిగా విశాఖను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓ పత్రిక యజమాని, ఆ పత్రికను తన చేతిలోకి తీసుకోక ముందు విశాఖలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ను తన మిత్రుల భాగస్వామ్యంతో నడపలేదా? విజయవాడకు చెందిన ఓ ముద్రణాసంస్థ విశాఖ బ్రాంచ్ లో కీలక బాధ్యుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఆ వ్యవహారాలు అన్నీ చూసుకోలేదా?
ఒక చిన్న ఏజెన్సీ తీసుకుని విశాఖ వచ్చి, ఇవ్వాళ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఏజెన్సీగా మారి, మరోపక్క హోటల్, రియల్ ఎస్టేట్ రంగంలో వేలాది కోట్లు ఆర్జించిన పెద్దాయిన తొలి అడుగు విశాఖలో కాదా వేసింది? ఇలా ఒక్కరేమిటి ఇద్దరేమిటి? ఎందరో పొట్ట చేత్తో పట్టుకుని విశాఖ వచ్చి, ఇక్కడ వ్యాపారాలు చేసి వందలాది కోట్లు సంపాదించారు.
తప్పు లేదు. కష్టపడ్డారు. తమ తెలివితేటలు పణంగా పెట్టారు. సంపాదించుకున్నారు. కానీ తమను తల్లిలా ఆదరించిన విశాఖ రాజధానిగా మారుతోంది అంటే మాత్రం వీళ్లెవరు సహించలేకపోతున్నారు. తమ తమ మూలాలు వున్న ప్రాంతంలోనే రాజధాని వుండాలని మనసా వాచా కోరుకుంటున్నారు. అందుకోసం విశాఖను హత్య చేయడానికి వెనుకాడడం లేదు. ఇంత ముద్ద పెడితే ఏ జీవి అయినా విశ్వాసం చూపిస్తుంది. కానీ వందలాది కోట్లు ఆర్జించడానికి మూలమైన విశాఖ మీద ఈ జనాలకు విశ్వాసం లేదేమిటో?
కానీ తన తల్లిని నిర్దాక్షిణ్యంగా ఓఢించిన విశాఖ మీద జగన్ మాత్రం అపారమైన ప్రేమ పెంచుకుని, ఎందరు అడ్డం పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, విశాఖ మెడలో రాజదాని అనే ఐడెంటీ కార్డువేయాలని చూస్తున్నారు. గ్రేట్ కదా?