అభిమానులు జోక్‌ని జోక్‌లా చూడలేరు. కనీసం ఏ కాంటెక్స్ట్లో పెట్టారనేది కూడా పట్టించుకోరు. తమ హీరోని ఎవరైనా కామెంట్ చేసారంటే ఇక అసలు ఊరుకోరు. ఇంతకీ విషయం ఏమిటంటే… ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన తెలుగు సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలో రెండు క్యారెక్టర్లను మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌గా చూపించారు.
ఈ క్యారెక్టర్ల మధ్య సంభాషణ కూడా సగటు హీరోల అభిమానులకు తగ్గట్టే వుండేలా దర్శకుడు మహా డైలాగులు రాసాడు. మహేష్ ఫాన్ అయిన అమ్మాయిని ఉడికించడానికి… ఎన్టీఆర్ ఫ్యాన్ ఇలా అంటాడు ‘మీవాడు లేజీ. నిలబడ్డ చోటినుంచి కదలకుండా ఫైట్ చేస్తాడు. మావాడు యాక్టివ్. ఎలా పరుగెడుతున్నాడో చూసావా?’ అంటాడు. దానికి ఆమె ‘మావాడు క్లాస్’ అంటుంది.
ఇది సరదా సంభాషణే అయినా కానీ మహేష్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. అసలే హర్టయిన వాళ్లను ఎన్టీఆర్ ఫాన్స్ మరింతగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రం ఫ్యాన్స్ వార్స్‌కి కారణమయింది. మామూలుగానే ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటూ వుంటారు. సినిమా డైలాగ్ దొరికేసరికి కీబోర్డ్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసారు. ఇదంతా చూస్తే… మళ్లీ మన హీరోల గురించిన సరదా కామెంట్ చేయడానికి కూడా ఎవరైనా జంకుతారు.