విషాదంలో మళ్లీ విషాదం. ఈ ఘోర ప్రమాదం గురించి తెలిస్తే…ఇది కలా? నిజమా? జీవితం ఇంత అన్యాయంగా కూడా ఉంటుందా? అనే అనుమానం, ఆందోళన కలగకమానవు. జీవితానికి ఇంత ఘోరంగా రాత రాసిన విధాతను కాలర్ పట్టుకుని నిలదీయా లన్నంత ఆక్రోశం, ఆవేశం.
విశాఖ పారిశ్రామిక నగరంలో నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్‌యార్డులో శనివారం ఉ.11.50 గంటలకు భారీ క్రేన్ కుప్పకూ లడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒడిస్సా కార్మికుడు ఉన్నాడు. విశాఖ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుమారుడిని చివరి చూపు చూసేందుకు ఆ రాష్ట్రం నుంచి స్కార్పియోలో తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రాదులు బయల్దేరారు.
ఒడిస్సా దాటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించాక శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టి. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగా త్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితులంతా ఒడిస్సా రాష్ట్రంలోని బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఒక వైపు కుమారుడి చివరి చూపునకు కూడా నోచుకోకుండా ఘోర రోడ్డు ప్రమాదానికి గురి కావడం మనసును కదిలిస్తోంది. ఈ దుస్థితి పగవారికి కూడా వద్దు దేవుడా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.