మూడు ముళ్లు వేసిన భర్త.. జీవితాంతం అండగా నిలవాల్సిన వాడు.. అతడే కీచకుడిగా మారాడు. మరో ముగ్గురితో కలిసి తన భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ లో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ సెగ్మెంట్ లో ఉన్న పీలీభీత్ లో ప్రభుత్వ అంబులెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి, అే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో 2016లో పెళ్లయింది. అయితే పెళ్లయిన 3 నెలల నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు ఈ దుర్మార్గుడు. ఈ క్రమంలో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
పోలీసులు, పెద్దల సమక్షంలో మరోసారి ఈ జంట కలుసుకుంది. అయితే భర్త ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఎలాగైనా భార్య తరఫు నుంచి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన భార్య ను తానే కిడ్నాప్ చేశాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి మరో ప్రాంతానికి తరలించాడు.
4 రోజుల పాటు భార్యను నిర్బంధించిన భర్త, తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎన్నో చిత్రహింసలకు గురిచేశాయి. తర్వాత ఆమెను సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఎలాగోలా బతికి బయటపడిన ఆ మహిళ, పోలీసులకు ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్తతో పాటు మిగతా ముగ్గుర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.