బాబు కామెడీ: ఎంత తొక్కితే అంత పైకి లేస్తాం!

2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోలుకుందా.? ఈ ప్రశ్నకు తెలుగు తమ్ముళ్ళ దగ్గర సమాధానం లేదు. దొరకదు కూడా! ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కేసీఆర్‌ తొక్కేశారు. ఆంద్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు…

2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోలుకుందా.? ఈ ప్రశ్నకు తెలుగు తమ్ముళ్ళ దగ్గర సమాధానం లేదు. దొరకదు కూడా! ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కేసీఆర్‌ తొక్కేశారు. ఆంద్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే దుస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'దయతలచి' వదిలేస్తున్నారుగానీ, లేకపోతే.. ఈపాటికే తెలుగుదేశం పార్టీ అడ్రస్‌ ఆంధ్రప్రదేశ్‌లోనూ గల్లంతయిపోయేదే.!

పార్టీ పరిస్థితి అత్యంత హీనంగా తయారైనా.. తెలుగు తమ్ముళ్ళు పార్టీ మీద నమ్మకం కోల్పోయి తమదారి తాము చూసుకుంటున్నా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాత్రం కామెడీలు ఆపడంలేదు. 'ఎంత తొక్కితే అంత పైకి లేస్తాం.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వున్నాను.. అందరి జాతకాలూ నాకు తెలుసు..' అంటూ విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారిపోయాయి.

ప్రస్తుతానికి చంద్రబాబు సహా టీడీపీలో 23మంది ఎమ్మెల్యేలున్నారు. ముగ్గురు లోక్‌సభ సభ్యులు ఆ పార్టీకి వున్నారు. కానీ, ఏం లాభం.? వారిలో చాలామంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారాయె. రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ఇప్పటికే టీడీపీకి గుడ్‌ బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయిన విషయం విదితమే. 'పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందేమో..' అన్న భయంతో ఆగుతున్నారుగానీ, లేకపోతే ఎమ్మెల్యేలలో చాలామంది టీడీపీని వీడి, వైసీపీలోకో.. బీజేపీలోకో చెక్కేసేవారే.

గడచిన నాలుగు నెలల్లో చంద్రబాబు, ప్రజోపయోగ కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా.? అంటే అదీలేదు. ఇంకా 'ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..' అని చెప్పుకోవడం.. 'రాష్ట్రంలో అరాచక పాలన.. రౌడీ ప్రభుత్వం..' అంటూ నోరు పారేసుకోవడం.. పోలీసు వ్యవస్థకి హెచ్చరికలు జారీ చేయడం.. ఇలా చంద్రబాబే స్వయంగా టీడీపీని మరింత పలచన చేసేస్తున్నారు. పైకి లేవడం సంగతి తర్వాత.. 2024 ఎన్నికల వరకూ టీడీపీ వుంటుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఇప్పుడు.  

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!