పవన్ ఏ సినిమా ఎప్పుడు?

సినిమాలు థియేటర్ లోక ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైన్ మీద సైన్ చేస్తున్నారు. అనౌన్స్ మెంట్ లు, పూజలు జరిగిపోతున్నాయి.  Advertisement ప్రస్తుతానికి క్రిష్ డైరక్షన్ లో…

సినిమాలు థియేటర్ లోక ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైన్ మీద సైన్ చేస్తున్నారు. అనౌన్స్ మెంట్ లు, పూజలు జరిగిపోతున్నాయి. 

ప్రస్తుతానికి క్రిష్ డైరక్షన్ లో హరి హర వీర మల్లు సినిమా ఒక్కటే సెట్ మీద షూటింగ్ లో వుంది. ఈ సినిమా సగానికి పైగా పూర్తయింది. మరో సగం పూర్తి కావాలి. సిజి, గ్రాఫిక్ వర్క్ వగైరా కాస్త భారీగానే వుంది. అందువల్ల ఈ సినిమా 2023 సమ్మర్ వేళకు రెడీ అవుతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే వారానికి నాలుగు రోజుల వంతున పవన్ పని చేస్తున్నారు. ఆ లెక్కన ఎప్పటికి అవుతుంది అన్నది చూడాలి.

హరి హర వీరమల్లు పూర్తయితే తప్ప మరో సినిమా ప్రారంభించరు. అది పక్కా. మరి సుజిత్-దానయ్య సినిమా ముందు చేస్తారు అని టాక్ వినిపిస్తోంది. అది తక్కువ రోజులు వర్క్ అని టాక్. ఆ లెక్కన ఆ సినిమా ముందు ప్రారంభించినా దసరా నాటికి రెడీ అయితేనే 2023 లో విడుదల వుంటుంది లేదంటే మళ్లీ 2024 సంక్రాంతినే. పైగా పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్-మహేష్ సినిమా ఆగస్టులో వుండగా పవన్ తన సినిమా వేయరు కదా.

ఈ లెక్కన హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..ఎప్పుడు విడుదలవుతుంది అన్నది చూడాలి. అదీ కాక ప్రస్తుతం పవన్ కు సన్నిహితంగా వున్న విశ్వప్రసాద్ నిర్మాతగా సముద్రఖని సినిమా ఒకటి వుండనే వుంది. అది వుంటుందా? వుండదా అన్న సందేహాలు వున్నాయి. మరి అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో? విడుదల అవుతుందో? పవన్ కే తెలియాలి.

చూస్తుంటే 2023లో హరి హర వీరమల్లు…2024లో రెండు సినిమాలు 2025లో ఓ సినిమా విడుదలవుతాయేమో? ఈ లోగా మరే సినిమాకు ఓకె అనకుండా వుంటే. ఇవన్నీ కాక ఎన్నికలు..టూర్లు..అలాంటి కార్యక్రమాలు కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వుంటుంది.