టైటిళ్ల ప్రకటన ఆపిన సెంటిమెంట్

నందమూరి బాలయ్య బర్త్ డే ఈ రోజు. మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా టైటిల్ ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశగా చూసారు. ‘జైబాలయ్య’ అనే టైటిల్ లేకుండానే విడియో గ్లింప్స్ బయటకు వచ్చింది. సరే, అందులో…

నందమూరి బాలయ్య బర్త్ డే ఈ రోజు. మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా టైటిల్ ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశగా చూసారు. ‘జైబాలయ్య’ అనే టైటిల్ లేకుండానే విడియో గ్లింప్స్ బయటకు వచ్చింది. సరే, అందులో వినిపించిన డైలాగులు ఎలా వున్నాయి, వాటిలో వినేసినవి ఎన్ని, గ్లింప్స్ ఎలా వుంది. 

అందులో మఫ్టీ లేదా వేరే సినిమాల షాట్ లు ఎన్ని అన్న సంగతి పక్కన పెడితే అసలు టైటిల్ ఎందుకు అనౌన్స్ చేయలేదు అన్నది పాయింట్. ఆ టైటిల్ మాత్రమే కాదు. అనిల్ రావిపూడి చేయబోయే సాహు గారపాటి సినిమా టైటిల్ కూడా అనౌన్స్ మెంట్ వుంటుందనుకున్నారు. బ్రో..ఐ డోంట్ కేర్ అనే ఆ టైటిల్ కూడా విడుదల చేయలేదు.

ఇటు జై బాలయ్య, అటు బ్రో ఐ డోంట్ కేర్ టైటిళ్లు బయటకు రాకపోవడం వెనుక బాలయ్య సెంటిమెంట్ వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. బాలయ్య అంటేనే సెంటిమెంట్లు. ఈ టైటిళ్ల సెంటి మెంట్ మాత్రం కొత్తగా అఖండ సినిమాలో వచ్చిందట. 

అఖండ సినిమా టైటిల్ అంత త్వరగా బయటకు రాలేదు. విడుదల దగ్గరకు వచ్చేవరకు ఎన్ బి కె 106 గా చలామణీ అయింది. ఆ తరువాత అఖండ టైటిల్ అనౌన్స్ అయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

దాంతో టైటిల్ కన్నా ఇలా ఎన్ బి కె 7, ఎన్ బి కె 8 అని చెప్పడమే లక్ అని బాలయ్య ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఓకె చేసిన టైటిళ్లను కూడా దాచి వుంచారు. మరి కొన్నాళ్లు ఇలాగే వినిపిస్తాయి బాలయ్య టైటిళ్లు.