విశాఖకు కియా..

కియా సంస్థ ప్రస్తుతం రాయలసీమలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆ సంస్థ తరలివెళ్ళిపోతుంది అని వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెఉగుదేశంతో పాటు దాని అనుకూల మీడియా ప్రచారం విపరీతంగా చేశాయి. అయినా అది…

కియా సంస్థ ప్రస్తుతం రాయలసీమలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆ సంస్థ తరలివెళ్ళిపోతుంది అని వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తెఉగుదేశంతో పాటు దాని అనుకూల మీడియా ప్రచారం విపరీతంగా చేశాయి. అయినా అది నిజం కాలేదు ఇక తొలి ఉత్పత్తి వైసీపీ పాలనలోనే జరిగింది.

కియా సంస్థ యాజమాన్యం కూడా ఏపీ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా సహకరిస్తోదని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా విశాఖకు కియా సంస్థ నిర్వహాకులు వచ్చి పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాధ్ తో చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున తమకు లభిస్తున్న సాయానికి వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు

వచ్చే ఏడాది విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి కియా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఏపీలో మరిన్ని కీలకమైన సిటీలలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు గల అవకాశాలను వారు మంత్రితో చర్చించారు. విశాఖ పెట్టుబడులకు అనువైన చోటు అని, అక్కడ కియా తన కార్యకలాపాలను విస్తరించుకోవాలని మంత్రి సూచించారు.

విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు కియా సంస్థ ముందుకు వస్తోందని అంటున్నారు. రానున్న రోజులలో విశాఖలోనూ క్రియా బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అని అధికార వర్గాలు తెలియచేస్తున్నారు. వచ్చే ఏడాది లో జరితే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఏపీకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపధ్యంలో ముందు ఏపీలో ఉన్న వాటి నుంచే ప్రమోషన్ మొదలెడుతున్నారు. కియా తో పాటు మరిన్ని సంస్థలు విశాఖ వస్తాయని తెలుస్తోంది.