ఆర్ఆర్ఆర్ ఓవర్ సీస్ @ 100 కోట్లు

ఆశ్చర్యపోవద్దు..ఆర్ఆర్ఆర్ ఓవర్ సీస్ డీల్ 67 కోట్లకు చాలా అంటే చాలా కాలం కిందట అయిపోయింది కదా? కొత్తగా ఈ రేటేమిటి అని అనుకోవద్దు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఓవర్ సీస్ కోసం 67 కోట్లు…

ఆశ్చర్యపోవద్దు..ఆర్ఆర్ఆర్ ఓవర్ సీస్ డీల్ 67 కోట్లకు చాలా అంటే చాలా కాలం కిందట అయిపోయింది కదా? కొత్తగా ఈ రేటేమిటి అని అనుకోవద్దు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఓవర్ సీస్ కోసం 67 కోట్లు ఒకేసారి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది ఫారస్ ఫిల్మ్స్ సంస్థ. అంత మొత్తం ఒకేసారి, సింగిల్ పేమెంట్ ఇవ్వడంతో ఆ రేటుకు కిట్టుబాటు అయింది.

కానీ ఇది జరిగి చాలా కాలం అయిపోయింది. తాజా విడుదల తేదీకి దాదాపు ముఫై నెలల కిందటి మాట ఇది. కనీసం బ్యాంకు వడ్డీ వేసుకున్నా నెలకు కోటి రూపాయల వడ్డీ పడుతోంది. అంటే 97 కోట్ల రూపాయలు లెక్క తేలుతోంది వడ్డీ కలుపుకుంటే.

అది కూడా జనవరిలో విడుదలయితే. లేదూ మార్చికి వెళ్తే మరో రెండు కోట్లు అదనం. అది కూడా బ్యాంకు వడ్డీ  లెక్క అయితే. కానీ ఇండస్ట్రీలో బ్యాంకు వడ్డీకి ఇచ్చేవాళ్లు ఎవ్వరూ లేరు. హీనంలో హీనం రెండు రూపాయల వడ్డీ. ఆ లెక్కన చూసుకుంటే మరో అయిదారు కోట్లు అదనం,

మరి ఈ లెక్కన సినిమా విడుదల చేస్తే ఖర్చులు, కమిషన్ అన్నీ కలుపుకుంటే ఓవర్ సీస్ మొత్తం మీద 160 నుంచి 170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాల్సి వుంటుంది ఆర్ఆర్ఆర్..ఈ ఫీట్ సాధ్యమేనా?