సంస్కారం సంపాదించని నాగబాబు

టాలీవుడ్ లోని అద్భుతమైన నటుల్లో ఒకరైన కోటా శ్రీనివాసరావు మీద అన్న చిరంజీవి మద్దతుతో సినిమాల్లోకి వచ్చిన నటుడు నాగబాబు. అది అందరికీ తెలిసిందే.  Advertisement చిరంజీవి స్వయం శక్తితో వచ్చి, ఎదిగారు కానీ…

టాలీవుడ్ లోని అద్భుతమైన నటుల్లో ఒకరైన కోటా శ్రీనివాసరావు మీద అన్న చిరంజీవి మద్దతుతో సినిమాల్లోకి వచ్చిన నటుడు నాగబాబు. అది అందరికీ తెలిసిందే. 

చిరంజీవి స్వయం శక్తితో వచ్చి, ఎదిగారు కానీ నాగబాబు కాదు. చిరంజీవి సోదరుడిగా ఆయనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికింది. హీరో లెవెల్ నటుడు కావాలనుకున్నారు, ఆయనకు తగిన క్యారెక్టర్లతో ట్రయ్ చేసారు. కానీ వీలు కాలేదు. ఆఖరికి క్యారెక్టర్ యాక్టర్ గా సెటిల్ అయ్యారు. 

మెగాస్టార్ సన్నిహితుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి పుణ్యమా అని జబర్దస్త్ అనే షో దొరికింది. అక్కడ కూడా ఆయనతో విభేదించి, తన సత్తా చాటే ఆలోచనతో స్వంత షో స్టార్ట్ చేసారు. కానీ సక్సెస్ కాలేదు. అది కూడా అందరికీ తెలిసిందే. ఆఖరికి రాజకీయంగా కూడా సక్సెస్ కాలేకపోయారు. 

అలాంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ మీద అవాకులు, చవాకులు మాట్లాడడం అంటే ఏమనుకోవాలి? కోటా ఎలాంటి నటుడు అన్నది ఇవ్వాళ కొత్తగా ఎవ్వరూ కితాబు ఇవ్వనక్కరలేదు. ఆయన ఎవరి ప్రాపకంతోనూ సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు. 

ఎవరి ప్రాపకంతోనూ అవకాశాలు తెచ్చుకోలేదు. ఏ సామాజిక అవకాశాలు వాడుకుని ఎదగలేదు. తనకంటూ ఒక సర్కిల్ పెంచుకుని అవకాశాలు పెంచుకోలేదు. ఇక్కడి గ్రూపు రాజకీయాల్లో వేలు పెట్టాలనుకోలేదు. ఆ రోజుల్లోనే భాజపా తరపున ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 

కోటా నటనలో పదోశాతం నటన ప్రదర్శించిన దాఖలా నాగబాబుకు వుందా? అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం వుంటుందా?  పైగా 60 ఏళ్లకు దగ్గరవుతున్న నాగబాబు, వయసు మీదపడిన కోటా ఎప్పుడు వుంటారో? ఎప్పుడో పోతారో? అనే విధంగా కామెంట్ చేయడం ఎంత నీచం? డబ్బు సంపాదించేసినంత మాత్రాన సంస్కారం రాదు అనడానికి ఇదే నిదర్శనం అనుకోవాలా?