పవన్ స్టేట్ మెంట్.. ఎవరికి వర్తిస్తుందబ్బా…!

“వ్యక్తులు చేసేది ఎప్పుడూ సినిమా రంగానికి అంటదు. వ్యక్తులు చేసే ఆరోపణలు కేవలం వ్యక్తిగతం, సినిమా రంగానికి అది అంటదు.” Advertisement పొద్దున్నే పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. మూవీ ఆర్టిస్ట్…

“వ్యక్తులు చేసేది ఎప్పుడూ సినిమా రంగానికి అంటదు. వ్యక్తులు చేసే ఆరోపణలు కేవలం వ్యక్తిగతం, సినిమా రంగానికి అది అంటదు.”

పొద్దున్నే పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన పవన్ కల్యాణ్ పై విధంగా స్పందించారు. ఆయన స్టేట్ మెంట్ అయితే బాగుంది కానీ, అది ఎవ్వరికి వర్తిస్తుందనేది అసలు పాయింట్ ఇక్కడ.

అసోసియేషన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. నాగబాబు కూడా చివరి 3 రోజులు ప్రచారంలోకి వచ్చి, వ్యవహారాన్ని మరింత కంపు చేసిన విషయం తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకొని పవన్ పై వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి.

సొంత ప్రకనట.. స్వీయ అనుభవం

అయితే అదే సమయంలో.. పవన్ చేసిన ఆ వ్యాఖ్యలు అతడికి కూడా వర్తిస్తాయంటున్నారు చాలామంది. అసోసియేషన్ ఎన్నికల ప్రచారం కంటే ముందే, ఓ సినిమా ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. పవన్ వ్యాఖ్యలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ఏకంగా టాలీవుడ్ సంఘాలు ప్రెస్ నోట్స్ విడుదల చేశాయి. 

పవన్ ఈరోజు ఉదయం చేసిన వ్యాఖ్యలు, అతడు కొన్ని రోజుల కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా వర్తిస్తాయంటున్నారు చాలామంది. తను అప్పట్లో చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని, తను చేసిన కామెంట్స్ ఇండస్ట్రీకి అంటవని పవన్ పరోక్షంగా చెప్పినట్టయింది.

మరోవైపు మోహన్ బాబు, చిరంజీవి బంధంపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నారు. ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు పరస్పరం అవగాహన, సంప్రదింపులతో పదవులు  పొందాయని.. అక్కడే అంత సహకారం ఉన్నప్పుడు, “మా” లో కూర్చొని మాట్లాడుకుంటే పనైపోయేదన్నారు పవన్. అసోసియేషన్ ఎన్నికల్లో ఇంత పోటీ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదని, ఇది కొంచెం ఇబ్బందిగానే ఉందని వ్యాఖ్యానించారు.