జూపూడి వ్యవహారంలో టీడీపీ మీడియా ఆనందం!

ఇన్నాళ్లూ తమ వద్ద ఉన్నప్పుడు ఆయనను ఒక మేధావిగా, తెలుగుదేశం పార్టీ వాయిస్ గా చూపించుకున్నారు. ఆయనేమో అధికారం చేతులు మారడంతో తను కూడా పార్టీ మారుతూ ఉన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం మీడియా…

ఇన్నాళ్లూ తమ వద్ద ఉన్నప్పుడు ఆయనను ఒక మేధావిగా, తెలుగుదేశం పార్టీ వాయిస్ గా చూపించుకున్నారు. ఆయనేమో అధికారం చేతులు మారడంతో తను కూడా పార్టీ మారుతూ ఉన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం మీడియా మరోరకంగా ఆనందిస్తోంది. అదేమిటంటే.. జూపూడి ప్రభాకర్ రావు చేరిక పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రగులుతూ ఉందట.

మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. తెలుగుదేశం పార్టీని ఒకరు వీడారు అనే విషయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది అనే మ్యాటర్ ను హైలెట్ చేయాలని తెలుగుదేశం అనుకూల మీడియా తాపత్రయపడుతున్న వైనం చూస్తే ఇదొక ప్రహసనం. అంతజేసీ జూపూడి ఏ ప్రజా నాయకుడు కాకపోయా!

కుల రాజకీయానికి జూపూడిని చంద్రబాబు నాయుడు వాడుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారాలకే ఆయనను వాడుకునే అవకాశం ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీకి అంత అవకాశం దక్కేలాలేదు. అధికారానికి దాసోహం అన్నట్టుగా జూపూడీ జంప్ చేసేశారు. ఈ విషయాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కానట్టుగా తెలుగుదేశం పార్టీ.. జూపూడి చేరికపై వైఎస్సార్సీపీ అసహనం పెల్లుబుకుపోతోందని వార్తలను ఇస్తున్నారు. ఇదీ తెలుగుదేశం అనుకూల మీడియా తీరు.

ఏ స్థాయి నేతలు అయినా.. వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినా, ఆ పార్టీకి షాకే అని, ఆ పార్టీలోకి ఎవరైనా చేరినా ఆ పార్టీకి షాకే అని కథనాలు అచ్చేస్తూ ఉన్నారు. ఈ తీరుతోనే అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసుకుంటూ ఉంది. ఆ మధ్య ఆల్రెడీ వైసీపీ నుంచి బహిష్కరింపబడిన నేత ఒకరు తెలుగుదేశం పార్టీలోకి  చేరితే.. అది జగన్ కు షాక్ అని ప్రచారం చేసుకున్న వాళ్ల నుంచి కొత్తగా ఇంకా ఏం ఎక్స్ పెక్ట్ చేసేది ఉంటుంది!

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం