ట్రెండింగ్: జార్జిరెడ్డి ట్రైలర్

ఉస్మానియా క్యాంపస్ రాజకీయాల హీరో.. వామపక్ష విద్యార్థి సంఘం ప్రతినిధి, దివంగత జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'జార్జి రెడ్డి'. 'దళం' సినిమా ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ…

ఉస్మానియా క్యాంపస్ రాజకీయాల హీరో.. వామపక్ష విద్యార్థి సంఘం ప్రతినిధి, దివంగత జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'జార్జి రెడ్డి'. 'దళం' సినిమా ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆసక్తిని రేపుతూ ఉంది. విడుదల అయిన కొద్ది సేపటికే ఇది నెట్ ట్రెండ్స్ లో ముందుండటం విశేషం.

చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుని, పీడీఎస్ యూ స్థాపకుడుగా నిలిచిన జార్జిరెడ్డి విషాదాంత కథ ఈ సినిమా. ట్రూ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్టుగా రూపకర్తలు ప్రకటించారు. విద్యార్థి ఉద్యమ రాజకీయాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి.

చాలా సినిమాల్లో వాటిని కొద్దిమేర వాడుకుంటూ ఉంటారు. అయితే పూర్తిస్థాయిలో అలాంటి సినిమాలు అరుదు. అందునా ట్రూ ఈవెంట్స్ ఆధారమైన సినిమా కాబట్టి మరింత ఆసక్తిదాయకంగా నిలుస్తూ ఉంది. ఈ సినిమా ట్రైలర్ ఆ మేరకు ఆసక్తిని రేపుతూ ఉంది. కాన్సెప్ట్ కు తగినట్టుగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ తదితరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.