ఆమెకు పది రోజులే గడువు…ఈలోగా ఏం జరుగుతుంది?

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇంకా పది రోజులే గడువుంది. దేనికి గడువు అనే డౌట్ వస్తోంది కదా ? ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ కు తాత్కాలిక అధ్యక్షురాలు కదా. ఆ పదవి…

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇంకా పది రోజులే గడువుంది. దేనికి గడువు అనే డౌట్ వస్తోంది కదా ? ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ కు తాత్కాలిక అధ్యక్షురాలు కదా. ఆ పదవి గడువు ఆగస్టు 10 వ తేదీతో ముగుస్తోంది. ఆ గడువు లోపలే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఎవరూ ఎన్నిక కాకపొతే పర్మినెంట్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగుతారా ? అందుకు ఆమె అంగీకరిస్తారా ?  ఆమె అంగీకరించకపోతే కొత్త అధ్యక్షుడు ఎవరు?

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్న వేధిస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు. ఇతర పార్టీల్లోనూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనే విషయంపై ఆసక్తిగా ఉంది. నిజానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అది ఒక కుటుంబం చేతుల్లో ఉంది. అధ్యక్ష పదవి ఆ కుటుంబ  సభ్యులు తప్ప మరొకరు చేపట్టేందుకు అవకాశం లేదు.

ఆ పదవికి పోటీ పడటానికి ఎవరూ సాహసం చేయరు కూడా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అనే ప్రశ్న తలెత్తడానికి కారణం సోనియా గాంధీ కుమారుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే. ఈ సంగతి అందరికీ తెలిసిందే.  2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ పదవిని వదులుకున్నారు. ఆ పని చేయొద్దని ఎంతమంది చెప్పినా వినలేదు. తనకు  అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించారు.

తానింక రెస్టు తీసుకోవచ్చని అనుకున్నారు. కానీ రాహుల్ పగ్గాలను మధ్యలోనే వదిలేశారు. దీంతో గత్యంతరం లేక ఆమే  తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ గడువు ఆగస్టు 10 వ తేదీతో ముగుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే నాయకత్వ సంక్షోభానికి ముగింపు పలకాలని సోనియా అనుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ప్లాన్ చేశారు.

కానీ రాహుల్ గాంధీ పట్టు వీడకపోవడం, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం మొదలైన కారణాలతో అధ్యక్షుడి ఎన్నిక పెండింగ్ లో పడిపోయింది. చివరకు సోనియా గాంధీ పదవీ కాలం ముగిసే టైం కూడా వచ్చేసింది. అనారోగ్యం కారణంగా ఆమె తాజాగా ఆస్పత్రిలో చేరారు. రాహుల్ పదవి వదిలేసినప్పటి నుంచి ఆయనే మళ్ళీ  పగ్గాలు చేపట్టాలనే  డిమాండ్ కొనసాగుతూనే ఉంది.

నిన్న సోనియా గాంధీ పార్టీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష ఎన్నిక అంశాన్ని లేవనెత్తారు. రాహుల్ గాంధీయే మళ్ళీ పగ్గాలు తీసుకోవాలన్నారు. రాహుల్ కేంద్రప్రభుత్వం తీరును ఎండగట్టడం తాము చూస్తున్నామని, ప్రధాని మోడీని కడిగిపారేయడం గమనిస్తున్నామని కాబట్టి ఆయనే మళ్ళీ అధ్యక్షుడిగా రావాలని అన్నారు. ఎంపీలు చాలామంది రాహుల్ ను బలపరిచారు.

కరోనా మహమ్మారి సమయంలో రాహుల్ పార్టీని లీడ్ చేశారని ప్రశంసించారు. ప్రజావాణిని  బలంగా వినిపించారని అన్నారు. కానీ సమావేశంలోనే ఉన్న రాహుల్ గాంధీ మౌనంగా ఉండిపోయారు. కొందరు నాయకులు ప్రియాంక అయితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఆమె యాక్టివ్ గా ఉన్నారు. మోడీపై బాగానే విమర్శనా బాణాలు సంధిస్తున్నారు. ఆమెను యూపీ సీఎం అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించినట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి.

నిజానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాహుల్ గాంధీకే ఇవ్వాలని సోనియా కోరిక. ఆయన ద్వారానే కాంగ్రెస్ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని, ఆయన ప్రధాని కావాలని అనుకుంటున్నారు. ఆశపడుతున్నారు. రాహుల్ అంగీకరించకపోతే, సోనియా కొనసాగడానికి ఇష్టపడకపోతే ప్రియాంకా గాంధీని తెరమీదికి తెస్తారా ? అది కూడా కాకపొతే నాన్ గాంధీ కుటుంబానికి చెందిన నేతను అధ్యక్షుడిని చేస్తారా ? పదో తేదీకల్లా ఏం జరుగుతుంది ? వెయిట్ అండ్  సీ. 

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది