అయ్యన్నకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన వైసీపీ?

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయన జోలికి ఎవరు వెళ్ళినా మాటలతోనే మంటలు పెడతారు. టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్ అని చెప్పుకునే డేరింగ్ ఆయనకే ఉంది. నాలుగు దశాబ్దాల…

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయన జోలికి ఎవరు వెళ్ళినా మాటలతోనే మంటలు పెడతారు. టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్ అని చెప్పుకునే డేరింగ్ ఆయనకే ఉంది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అయ్యన్న దూకుడు గానే ఉంటూ వస్తున్నారు. ఆరున్నర పదుల వయసులోనూ ఆదే స్పీడ్ ఆయనలో ఉంది.

ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం అయ్యన్నపాత్రుడి మీద నిర్భయ కేసు ఒకటి నమోదు అయింది. నర్శీపట్నం కమిషనర్ క్రిష్ణవేణి తనను మాజీ మంత్రి అసభ్య పదజాలంతో దూషించారని చేసిన ఫిర్యాదు మీద పోలీసులు నిర్భయ  కేసు కట్టారు. దాంతో అయ్యన్న కొన్నాళ్ళు అద్రుశ్యమయ్యారు. హైకోర్టులో స్టే తెచ్చుకున్న మీదటనే ఆయన మళ్ళీ కుదుట పడ్డారు.

ఇది ఏపీలోనే పొలిటికల్ గా చర్చనీయాంశం అయింది. మరి ఎవరికీ లొంగని ఫైర్ బ్రాండ్ అయ్యన్నకే చుక్క‌లు చూపించిన ఆ కమిషనర్ కూడా అప్పట్లో హైలెట్ అయ్యారు. అటువంటి కమిషనర్ ని ఏ కారణం లేకుండా ఇపుడు బదిలీ చేసేశారు. దాంతో ఇదే టాపిక్ మీద పొలిటికల్ వ‌ర్గాల్లో హాట్ హట్ చర్చ సాగుతోంది.

సాధారణంగా అధికార పార్టీ నేతలకు అడ్డుతగిలిన అధికారులకే ట్రాన్స్ ఫర్ పనిష్మెంట్ ఇస్తూంటారు. మరి వైసీపీకి మోస్ట్ వాంటెండ్ టార్గెటెడ్ పొలిటీషియన్ గా ఉన్న అయ్యన్నపాత్రుడి మీద నిర్భయ కేసు పెట్టి మరీ బిగ్ ట్రబుల్ ఇచ్చిన ఆ కమిషనర్ కి బదిలీని బహుమానంగా ఇవ్వడం వెనక మతలబు ఏంటన్నది ఎవరికీ  అర్ధం కావడంలేదుట.

ఉంటే గింటే తెలుగుదేశానికి ఆమె మీద అక్కసు ఉండాలి, కానీ అధికార పార్టీ ఆమెకు ఇలా షాక్ ఇచ్చిందంటే రాజకీయ సమీకరణల్లో ఎక్కడో తేడా కొట్టిందా అన్న డౌట్లు వస్తున్నాయట. మొత్తానికి అయ్యన్నకు ఈ రకంగానైనా బిగ్ రిలీఫ్ ని వైసీపీ సర్కార్ ఇచ్చిందనుకోవాలేమో.

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు