పవన్ రాలేదు..బోర్డులు తీసేసారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారు ఫంక్షన్ కు అని బయటకు ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి మాత్రం ఆహ్వానం..స్వాగతం అంటూ పవన్ బోర్డులు రెడీ చేయమని చెప్పారు.  Advertisement…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారు ఫంక్షన్ కు అని బయటకు ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి మాత్రం ఆహ్వానం..స్వాగతం అంటూ పవన్ బోర్డులు రెడీ చేయమని చెప్పారు. 

ఇదంతా 'మహాసముద్రం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంగతే. ఈ ఫ్రీరిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. కానీ ఆయన అప్పటికే దర్శకుడు రాఘవేంద్రరావు పంక్షన్ కు వస్తానని మాట ఇచ్చేసారు. 

దాంతో మహా సముద్రం హీరో శర్వానంద్ కోసం ఆయన మిత్రుడు రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ ను అడిగినట్లు బోగట్టా. అయితే రిపబ్లిక్ ఫంక్షన్ తరువాత మరే సినిమా ఫంక్షన్ కు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారని గ్యాసిప్ లు వెలువడ్డాయి. కానీ మహా సముద్రం పంక్షన్ కు వస్తారని, కానీ పైకి ప్రకటించకుండతా సీక్రెట్ గా వుంచారని వార్తలు నిన్న, మొన్న వినిపించాయి.

ఈవెంట్ కంపెనీ కూడా పవన్ కు స్వాగతం అంటూ బోర్డులు తయారుచేయించి వుంచింది. నిర్మాతల సమాచారం మేరకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. కానీ సాయంత్రానికి ఆ బోర్డులు పక్కన పెట్టమని నిర్మాతలు చెప్పినట్లు తెలుస్తోంది. 

పవన్ వస్తారో..రారో అన్న క్లారిటీ లేకపోవడంతోనే మరి కొందరు యంగ్ హీరోలను ముందుగానే పిలిచి ఒప్పించినట్లు తెలుస్తోంది.