వైసీపీ ద‌మ్ము బీజేపీకి ఏదీ?

బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల జాతీయ పార్టీ, ఎంత‌టి వారైనా పార్టీ విధివిధానాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని ఆ పార్టీ అగ్ర‌నేత‌లు పెద్ద‌పెద్ద ఉప‌న్యా సాలు చెబుతుంటారు. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఆ పార్టీ అగ్ర‌నేత‌లు చెప్పినంత…

బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల జాతీయ పార్టీ, ఎంత‌టి వారైనా పార్టీ విధివిధానాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని ఆ పార్టీ అగ్ర‌నేత‌లు పెద్ద‌పెద్ద ఉప‌న్యా సాలు చెబుతుంటారు. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఆ పార్టీ అగ్ర‌నేత‌లు చెప్పినంత క్ర‌మ‌శిక్ష‌ణ‌, క‌ట్టుబాట్లు క‌నిపించ‌డం లేదు. ఇందుకు ఏపీ రాజ‌ధానిపై ఆ రాష్ట్ర బీజేపీ నేత‌ల అభిప్రాయాలే నిద‌ర్శ‌నం. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి మొద‌టి నుంచి త‌న పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాను రాజ్య‌స‌భ స‌భ్యుడిగా చెబుతున్నానంటూ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నా, బీజేపీ అధిష్టానం ఏమీ చేయ‌లేక పోతోంది.

బీజేపీతో పోల్చుకుంటే వైసీపీ ద‌మ్మున్న పార్టీ అని చెప్పాలి. త‌న పార్టీ విధానాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంపీ ర‌ఘు రామ‌కృష్ణంరాజు విష‌యంలో వైసీపీ క‌ఠిన వ్య‌వ‌హ‌రిస్తోంది. వైసీపీ నిషేధించిన చాన‌ళ్ల డిబేట్ల‌లో పాల్గొంటూ, పార్టీ, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేక వాయిస్ వినిపిస్తుండ‌డంతో ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్‌పై ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న‌దైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. ఆ త‌ర్వాత ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. భ‌విష్య‌త్ ప‌రిణామాలు ఏవైన‌ప్ప‌టికీ త‌మ పార్టీ, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా న‌డుచుకుంటున్న ఎంపీపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వైసీపీ ఏ మాత్రం వెనుకాడ‌లేదు.

మ‌రి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ చేస్తున్న‌దేంటి? త‌మ పార్టీ, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లా డుతున్న సుజ‌నా చౌద‌రి విష‌యంలో ఎందుకు ఉపేక్షిస్తుంద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు, బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రికి తేడా ఏంటి? ఇద్ద‌రూ త‌మ‌త‌మ పార్టీ, ప్ర‌భుత్వాల వైఖ‌రుల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిం చ‌డం లేదా? ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడు ఢిల్లీ వేదిక‌గా ఏం మాట్లాడారో చూద్దాం.

‘చంద్రబాబు రాజధాని నిర్మాణం ఉందంటే, రమ్మంటేవెళ్లాం. రిబ్బన్‌ కత్తిరించాం. ఇప్పుడు ఈయన (సీఎం జగన్‌) మూడం టున్నారు. మూడు రాజధానులంటే మీరు కలగజేసుకుంటారా? లేదా? అని టీడీపీ నేతలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రాజధాని అక్కడ ఉండాలని చెబుతున్నాం. రైతులకు మా మద్దతు ఉంటుందని చెబుతున్నాం. అంతేగానీ ఏది మీరు నిర్ణయిస్తే, మీరు ఏది ఉద్యమంగా నిర్మాణం చేస్తే దానికి వంతపాడాలా? మీరు మమ్మల్ని ఇరుకునపెట్టేలా ప్రయత్నిస్తే జడుసుకునే పార్టీ కాదు మాది’ అని వీర్రాజు తెలిపారు.

రాజ‌ధానిపై కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌నే ప‌దేప‌దే చెప్పే సుజ‌నా చౌద‌రిని విడిచి పెట్టి, ప్ర‌తిప‌క్ష టీడీపీని ఆడిపోసుకుంటే లాభం ఏంటి?  బీజేపీని ఇరుకున పెట్టేది సుజ‌నా చౌద‌రా? టీడీపీనా? ఒక వైపు బీజేపీ ఎంపీగా కొన‌సాగుతూ, మ‌రోవైపు టీడీపీ వాయిస్ వినిపిస్తున్న సుజ‌నా చౌద‌రిపై తాజాగా ఏపీ బీజేపీ ట్విట‌ర్లో చేసిన ప్ర‌క‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకొంది.

‘రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు. రాజ‌ధాని అంశంపై పార్టీ విధానాన్ని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో కొన‌సాగింపు ,అలాగే రాజ‌ధాని విష‌యం కేంద్రం ప‌రిధిలోకి రాద‌రు’ అని ట్విట‌ర్‌లో బీజేపీ స్ప‌ష్టం చేసింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. పార్టీ విధానాల‌కు విరుద్ధంగా మాట్లాడుతున్న సుజ‌నా చౌద‌రిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు బీజేపీ ఎందుకు జ‌డుస్తోంది? ఇప్పుడిదే అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌శ్న‌.

క‌ల్యాణ్‌సింగ్‌, ఉమాభార‌తి లాంటి అగ్ర‌నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వెనుకాడ‌ని బీజేపీ అధిష్టానం…సుజ‌నా చౌద‌రి విష‌యంలో మాత్రం ఎందుకు మీన‌మేషాలు లెక్కిస్తోంది?  ‘మీరు మమ్మల్ని ఇరుకునపెట్టేలా ప్రయత్నిస్తే జడుసుకునే పార్టీ కాదు మాది’ అని వీర్రాజు టీడీపీని హెచ్చ‌రించారు. బీజేపీని సొంత పార్టీ వాళ్లు మాత్రం ఇరుకున పెట్టొచ్చా? ప‌్ర‌త్య‌ర్థి పార్టీ వాళ్ల‌కు భ‌య‌ప‌డ‌ని బీజేపీ…సొంత పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడికి మాత్రం భ‌య‌ప‌డుతోందా? జ‌డుస్తుండ‌డం వ‌ల్లే  ట్విట‌ర్ ప్ర‌క‌ట‌న‌తో స‌రిపెడుతుందా? లేక కొర‌డా ఝుళిపిస్తుందా? అనే ప్ర‌శ్న‌ల‌కు సోము వీర్రాజు స‌మాధానం చెప్పాల్సి ఉంది.

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది