సానియా జీవితంలో తీవ్ర బాధాక‌ర‌మైంది అదే…

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న గురించి చెప్పారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమంలో సానియా మీర్జా మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు…

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న గురించి చెప్పారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమంలో సానియా మీర్జా మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించారు.

‘ఏదైనా సరే అది నా వల్ల కాదు అని నన్ను అంటే నేను ఒప్పుకోను. అది చేసి చూపిస్తా. వెనకడుగు వేయని తత్వం నాది. టెన్నిస్‌పై నాకున్న ప్రేమ వ్యాయామం చేసే దిశగా నడిపించింది’ అని అన్నారు. ‘ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయనిది నేను చేయాలనుకున్నా. మానసిక బలాన్ని నమ్ముకున్నా. ఇష్టమైన వాటిని తినకుండా నిగ్రహించుకున్నా. రోజుకు కనీసం అర్ధగంట వ్యాయామం చేయడం ముఖ్యం. ప్రసవానంతర కుంగుబాటుకు లోనుకాకుండా కసరత్తులు మేలు చేశాయి’ అని సానియా చెప్పుకొచ్చారు.

గ‌ర్భం దాల్చిన‌పుడు 23 కిలోల బ‌రువు పెరిగిన సానియా…ఆ త‌ర్వాత నాలుగు నెల‌ల్లో 26 కిలోలు త‌గ్గి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఒకానొక స‌మ‌యంలో ఇక ఆమె ఆట‌కు ప‌నిరాద‌ని కూడా అన్న‌వాళ్లు ఉన్నారు. అందుకే ఆమె ప్ర‌పంచంలో ఇంకెవ‌రూ చేయ‌నిది తాను చేయాల‌నుకుంటాన‌ని చెప్ప‌డం. బ‌రువు త‌గ్గ‌డానికి తాను చేసిన వ్యాయామాల వీడియోల ద్వారా వివ‌రించిన ఆమె మాట్లాడుతూ  రియో (2016) ఒలింపిక్స్‌లో ఓటమి త‌న‌ జీవితంలోని తీవ్ర బాధాకరమైన సంఘటనల్లో ఒకటిగా చెప్పుకొచ్చారు.

మరో ఒలింపిక్స్‌ ఆడతానని ఆ తర్వాత ఎప్పుడూ అనుకోలేద‌న్నారు. తిరిగి టెన్నిస్‌ బాట పట్టిన ఆమె వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు. తిరిగి ఆటలో అడుగుపెట్టినపుడు వచ్చే ఒలింపిక్స్‌లో ఆడి పతకం గెలవా లనుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. 

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది