క‌రోనాపై బాంబు పేల్చిన మంత్రి ఈట‌ల

క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బాంబు పేల్చారు. ఒక వైపు క‌రోనా వైర‌స్‌కు భ‌య‌ప డాల్సిన ప‌నిలేద‌ని, ఎక్క‌డిక‌క్క‌డ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని చెబుతూనే…ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కి గురి చేసే…

క‌రోనా మ‌హ‌మ్మారిపై తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బాంబు పేల్చారు. ఒక వైపు క‌రోనా వైర‌స్‌కు భ‌య‌ప డాల్సిన ప‌నిలేద‌ని, ఎక్క‌డిక‌క్క‌డ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని చెబుతూనే…ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కి గురి చేసే విష‌యాన్ని చెప్పారు. ఒక చాన‌ల్‌తో ఆయ‌న మాట్లాడుతూ నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

వైరస్‌ ప్రభావం చూస్తుంటే 81శాతం మందికి కరోనా వచ్చి, పోయే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెప్పారని మంత్రి ఈట‌ల బాంబు పేల్చారు.  ప్రస్తుత ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేస్తుంటే క‌రోనా వైరస్ ఇప్ప‌ట్లో తగ్గే అవకాశం లేదన్నారు. ఆ మ‌హ‌మ్మారితో  సహజీవనం చేస్తూ ముందుకెళ్లాల్సిందేనని స్ప‌ష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులతోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిన‌ట్టు ఈటల అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తోంద‌న్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు సాయం మాత్రమే చేసిందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.  తెలంగాణలో కరోనా కట్టడి చేయడంలో కొంతమేర విజయం సాధించామన్నారు.  ప్రజలంతా ప్రభుత్వంపై నమ్మ కంతో ఉండాలని, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని తెలంగాణ ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కోరారు.  

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది