రవిప్రకాష్ చుట్టూ మరింత బిగుసుకోనున్న ఉచ్చు!

మొదటేమో నీతులు చెప్పాడు. ఆ తర్వాత పరార్ అయ్యాడు! ఎంతోమంది రాజకీయ నేతలను ఇంటరాగేట్ చేసినంత పనిచేసిన ఈ నీతుల మారి తీరా తన మీద కేసులు వచ్చేసరికే చాన్నాళ్ల పాటు పరార్ అయ్యి,…

మొదటేమో నీతులు చెప్పాడు. ఆ తర్వాత పరార్ అయ్యాడు! ఎంతోమంది రాజకీయ నేతలను ఇంటరాగేట్ చేసినంత పనిచేసిన ఈ నీతుల మారి తీరా తన మీద కేసులు వచ్చేసరికే చాన్నాళ్ల పాటు పరార్ అయ్యి, తన నీతులు ఏపాటివో నిరూపించాడు. జర్నలిస్టును అంటూ చాలా నీతులు చెప్పిన ఈ మురుగు సమాజం ప్రతినిధి పరార్ అయ్యి తన కథేమిటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు.

అయితే చివరకు అరెస్ట్ జరగనే జరిగింది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు రవి ప్రకాష్ ను ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా కూడా లేరు. మొన్నామధ్య అమిత్ షాతో ఫొటోను పోస్టు చేసి తన రేంజ్ ఏమిటో చూపించాలని రవి ప్రకాష్ ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు జైల్లో ఈయనను ఏ బీజేపీ నేతా పరామర్శించడం లేదు. రేవంత్ రెడ్డి మాత్రం పరామర్శించి వచ్చారు.

మొన్నటి వరకూ రేవంత్ రెడ్డికి చాలాసాయం చేశాడట రవి ప్రకాష్. తన 'జర్నలిస్టిక్ స్కిల్స్' ను ఉపయోగించి రేవంత్ రెడ్డికి ప్రచారంలో సాయంచేశాడట రవి ప్రకాష్. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారని టాక్. ఆ సంగతలా ఉంటే.. రవి ప్రకాష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖరాశారు.

రవి ప్రకాష్ పై ఆర్థిక నేరాల ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని, తీవ్రమైన మనీలాండరింగ్ వ్యవహారాల్లో కూడా రవిప్రకాష్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఈ అభియోగాలపై సీబీఐ- ఈడీల విచారణ మొదలైతే రవిప్రకాష్ కథ కంచికే అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. 

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం