అద్దాల కళ్ళతో అందంగా అరకు…

అరకు. విశాఖ ఏజెన్సీలో అద్భుతమైన పర్యాటక క్షేత్రం. ఇక్కడకు జీవితంలో ఒకసారి అయినా రావాలని ప్రకృతి ప్రేమికులు అనుకుంటారు. ఎత్తైన కొండలు, పచ్చని పరిసరాలు, ముచ్చటగొలిపే వాతావరణం, గలగలా పారే జలపాతాలు ఇవన్నీ కలస్తే…

అరకు. విశాఖ ఏజెన్సీలో అద్భుతమైన పర్యాటక క్షేత్రం. ఇక్కడకు జీవితంలో ఒకసారి అయినా రావాలని ప్రకృతి ప్రేమికులు అనుకుంటారు. ఎత్తైన కొండలు, పచ్చని పరిసరాలు, ముచ్చటగొలిపే వాతావరణం, గలగలా పారే జలపాతాలు ఇవన్నీ కలస్తే అందమైన అరకు అవుతుంది.

ఏపీ టూరిజం వారి డెస్టిటేషన్ పాయింట్స్ లో అతి ముఖ్యమైన స్పాట్ గా అరకు ఉంది అంటే దాని పాముఖ్యత అర్ధమవుతోందిగా. ఇదిలా ఉంటే అరకు వెళ్ళేందుకు విశాఖ  నుంచి బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. రైళ్ళలో అరకు వెళ్ళేవారికి ఇపుడు అద్భుతమైన అనుభూతులను జత చేసేందుకు ఆ శాఖ సిద్ధంగా ఉంది.

అరకు వెళ్ళే మార్గంలో అందాలను చూసేందుకు విస్టోడోమ్ కోచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూంటే ఎట్టకేలకు మూడు విస్టోడోమ్ కోచ్ లు విశాఖ చేరుకున్నాయని రైల్వే  అధికారులు చెబుతున్నారు.

ఈ విస్టోడోమ్ కోచ్ లను అరకు వెళ్లే రైళ్ళకు  జత చేస్తారు. దీంతో ఈ కోచ్ లలో అద్దాల ద్వారా అటూ ఇటూ ఉన్న అరకు అందాలను రైలులో ప్రయాణిస్తూ కూడా హాయిగా ఆస్వాదించే వీలుంటుంది. ఇప్పటికే అరకు టూరిజానికి ఆదరణ ఎక్కువగా ఉంది. విస్టోడోమ్ కోచ్ లు కనుక వస్తే టూరిస్టుల తాకిడి ఇక రెట్టింపు అవుతుందని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.