కొండపొలం విడుదల కావడంతో.. ప్రస్తుతం అధికారికంగా రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఉన్న తెలుగు సినిమాలు అన్నీ అయిపోయినట్టే. తమిళంలో రెండు మూడు సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి.
తెలుగులో యంగ్ స్టార్ హీరోల అందరితోనూ దాదాపుగా నటించడం పూర్తి చేసిన రకుల్.. ఇక పెద్ద వయసులోని స్టార్ హీరోలకు ఛాయిస్ గా మారుతుందేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే నాగార్జున సరసన నటించింది. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి వాళ్లకు రకుల్ ఛాయిస్ గా ఉండవచ్చు.
ఆ సంగతలా ఉంటే.. బాలీవుడ్ లో రకుల్ ఫుల్ బిజీ. నటుడు అజయ్ దేవగణ్ ఆమెకు వరస అవకాశాలు ఇప్పిస్తున్నాడనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. అజయ్ సినిమాతో కొంతకాలం కిందట రకుల్ బాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీ తరహాలో కనిపించింది. ఆ సినిమా తర్వాత అజయ్ వరసగా ఆమెకు అవకాశాలు ఇస్తున్నట్టుగా ఉన్నాడు.
ఇప్పుడు కూడా అక్కడ అజయ్ కు సంబంధించిన రెండు సినిమాల్లో రకుల్ చేస్తోంది. వాటిల్లో ఒకదాన్ని అజయ్ దేవగణ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. అందులో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా తీసుకున్న ఆ సీనియర్ హీరో, ఇక తను హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఈమెకే అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నాడు.
ఇక తాజాగా అక్షయ్ కుమార్ సినిమాను రకుల్ కంప్లీట్ చేసింది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. వీటికి తోడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఒక సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇలా బాలీవుడ్ లో బడా హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్.