రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ వచ్చింది

అనేకానేక డిజాస్టర్ల తరువాత రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. చిన్న డైరక్టర్ జిఆర్ కృష్ణ దర్శకుడు. గతంలో ఈ కథ వేరే హీరోలతో అనుకున్నారు కానీ ఆఖరికి ఇది రాజ్…

అనేకానేక డిజాస్టర్ల తరువాత రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. చిన్న డైరక్టర్ జిఆర్ కృష్ణ దర్శకుడు. గతంలో ఈ కథ వేరే హీరోలతో అనుకున్నారు కానీ ఆఖరికి ఇది రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చి ఆగింది. క్యూట్ లవ్ అండ్ రొమాంటిక్ లైన్ తో ఈ సినిమాను తయారుచేసారు.

నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నవంబర్ రెండోవారంలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఫస్ట్ లుక్ ఇచ్చారు. అమ్మాయి బైక్ డ్రయివ్ చేస్తుంటే అబ్బాయి ఆనందంగా వెనుక హత్తుకుని కూర్చుని చూస్తున్న లుక్ ఇది.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తుండగా శిరీష్ నిర్మిస్తున్నారు. సుమారు అయిదు కోట్ల తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమా, నాన్ థియేటర్ హక్కులతోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అందుకే తన రెగ్యులర్ బయ్యర్ల ద్వారా నేరుగా విడుదల చేయిస్తున్నారు దిల్ రాజు.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!