cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

అల్లు.. బుల్ ఫైట్

అల్లు.. బుల్ ఫైట్

అల్లువారబ్బాయి, స్టయిలిష్ స్టార్ దసరా స్టిల్ ఇచ్చేసాడు. తివిక్రమ్ తో సినిమా కదా, ఎక్కడ క్లాస్ అనుకుంటారో? అసలే మొన్నటికి మొన్నే ఓ క్లాస్ స్టిల్ వదిలాం కూడా అనే ఐడియాతో పక్కా మాస్ స్టిల్ ఇచ్చారు. ఈ స్టిల్ లో అల్లు అర్జున్ బుల్ ఫైటర్ స్టయిల్ లో నిల్చున్నాడు.

నలుగురయిదుగురు రౌడీస్ దెబ్బలు తిని కింద పడిపోగా, అర్జున్ రెడ్ క్లాత్ కాలికి కట్టుకుని, చేతితో పట్టుకుని స్టయిల్ గా నిల్చుకున్నాడు. హారిక హాసిని పతాకంపై చినబాబు నిర్మించే ఈ సినిమా సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతోంది. దాదాపు 80 పర్సంట్ టాకీ పూర్తయింది. ఇక బ్యాలన్స్ వర్క్, పాటలు బాకీ వున్నాయి.

అక్టోబర్ ఎండింగ్ కి టాకీ ఫినిష్ చేసి, నవంబర్ లో పాటలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్తారు. ఇప్పటికే విడుదల చేసిన సామజవరగమన పాట భయంకరమైన వైరల్ అయిపోయింది. మిలియన్ల హిట్ లు వచ్చాయి. ఎక్కడవిన్నా ఆ పాటే వినిపిస్తోంది. త్వరలో మరో పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!