గాంధీ టైపు కథ చెప్పిన గాంధీ?

మేర్లపాక గాంధీ రెండు మంచి సినిమాలు ఇచ్చాడు కానీ కృష్ణార్జున యుద్ధంతో బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు యువి క్రియేషన్స్ కు ఓ సినిమా చేయాలి. అయితే ఆ సినిమాకు హీరోగా నాగచైతన్య అని ఆది…

మేర్లపాక గాంధీ రెండు మంచి సినిమాలు ఇచ్చాడు కానీ కృష్ణార్జున యుద్ధంతో బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు యువి క్రియేషన్స్ కు ఓ సినిమా చేయాలి. అయితే ఆ సినిమాకు హీరోగా నాగచైతన్య అని ఆది నుంచీ అనుకుంటున్నారు. కానీ చైతన్య బిజీ అయిపోయాడు. అంత సులువుగా ఇప్పట్లో డేట్ లు దొరికేలా లేవు. అందుకే ఈలోగా మరో హీరో ఎవరితోనైనా సినిమా చేసే ఆలోచనలో వున్నారు.

అందులో భాగంగా మేర్లపాక గాంధీతో మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ కు ఓ కథ చెప్పించినట్లు తెలుస్తోంది. ఆ కథ విని హీరో సాయిధరమ్ తేజ్ ఏ నిర్ణయమూ ఇంకా చెప్పలేదని, ఆలోచిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మేర్లపాక గాంధీ చెప్పిన కథ గురించి ఓ గ్యాసిప్ అయితే వినిపిస్తోంది.

హీరో ఊరందరి చేత మందు మానిపించడం లాంటి కాన్సెప్ట్ ఏదో వుందని, అదే చెప్పారని తెలుస్తోంది. యంగ్ హీరోతో ఈ లాంటి సోషల్ మెసేజ్ సినిమా తీయడం అన్నది కాస్త సాహసమే. మరి ఆ సబ్జెక్ట్ లో ఇంకేముందో తెలియదు. ప్రస్తుతానికి అయితే సాయితేజ్ ఇంకా ఓకె మాత్రం చెప్పలేదని తెలుస్తోంది.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!