చిరు 152కు రేపే శ్రీకారం

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో దర్శకుడు కొరటాల శివ రెడీగా వున్నారు. సైరా విడుదల కోసం వెయిటింగ్. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. దసరా…

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో దర్శకుడు కొరటాల శివ రెడీగా వున్నారు. సైరా విడుదల కోసం వెయిటింగ్. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. దసరా సందర్భంగా మెగాస్టార్-కొరటాల కాంబినేషన్ సినిమాకు పూజ నిర్వహించబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా తీసిన ఆఫీసులో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.

భరత్ అనే నేను సినిమా తరవాత కొరటాల చేయబోయే సినిమాగా దీని మీద మంచి అంచనాలు వున్నాయి. రాజమౌళి తరువాత కొరటాల శివనే వరుసగా సక్సెస్ లు చూస్తున్న దర్శకుడు. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అలాంటి డైరక్టర్ మెగాస్టార్ తో ఏం చేయబోతున్నారో అన్నది ఆసక్తికరంగా వుంది.

సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సబ్జెక్ట్ లు తీసుకుంటున్నారు మెగాస్టార్. రైతుల సమస్య మీద ఖైదీ 150, స్వాతంత్ర్య వీరుడి కథతో సైరా సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నారు. అందువల్ల మెగాస్టార్ కు తగిన కథనే కొరటాల ఎంచుకుని వుంటారు.

ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ తమ తమ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తారు.

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!