డోంట్ కేర్.. అంటున్న నయనతార!

తను టీవీ చూడటం మానేసినట్టుగా, ఆఖరికి తను నటించిన సినిమాలను టీవీలో వేసినా చూడటంలేదని సెలవిచ్చింది నయనతార. లోకం తన గురించి ఏమనుకుంటోంది అనే దిగులు తనకు అస్సలు లేదని ఈ హీరోయిన్ స్పష్టంచేసింది.…

తను టీవీ చూడటం మానేసినట్టుగా, ఆఖరికి తను నటించిన సినిమాలను టీవీలో వేసినా చూడటంలేదని సెలవిచ్చింది నయనతార. లోకం తన గురించి ఏమనుకుంటోంది అనే దిగులు తనకు అస్సలు లేదని ఈ హీరోయిన్ స్పష్టంచేసింది. తను దేని గురించి మాట్లాడదలుచుకోవడం లేదని, అందుకే పదేళ్లుగా తను ఎవరికి ఇంటర్వ్యూలు  కూడా ఇవ్వడం లేదని తన తాజా ఇంటర్వ్యూలో నయనతార చెప్పింది.

పదేళ్లుగా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని చెప్పిన ఈ హీరోయిన్ తాజాగా మాత్రం స్పందించింది. తన మాటలను గతంలో వక్రీకరించారని, అందుకే  తను ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని నయనతార చెప్పింది. ఇక టీవీ చూసే అలవాటు లేదని, అలాంటప్పుడు తన గురించి ఏం వార్తలను ప్రసారం చేసుకున్నా ఇబ్బంది లేదని చెప్పింది.

ఇక ఇండస్ట్రీల్లో పురుష డ్యామినేషన్ ఉందని ఉందని నయనతార అభిప్రాయపడింది. సోలోగా సక్సెస్ లు సాధించిన చాలామంది హీరోయిన్లు ఇలానే చెబుతూ ఉంటారు. ఆ కోవనే నయనతార వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తన పని తను చేసుకుపోతున్నట్టుగా చెప్పుకొచ్చింది. అలాగే సినిమాకు ఓకే అని చెప్పినప్పటికీ, క్యాస్టూమ్స్, మేకప్ విషయంలో తన ఇష్టాలే చెల్లుబాటు కావాలని నయనతార అంటోంది.

మూవీ మేకర్లు చెప్పినట్టుగా తను  గ్లామర్ ను ఒలికించడానికి రెడీ గా లేనట్టుగా వివరించింది. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఆ ప్రచారాలను తను పట్టించుకోవడం లేదని తేల్చింది. ఈ డిసెంబర్లో తన పెళ్లి అని ప్రచారం సాగుతున్న వైనంపై స్పందిస్తూ, డిసెంబర్ వస్తే కానీ అది అబద్ధమని అందరికీ అర్థంకాదని నయనతార వ్యాఖ్యానించింది.

మొత్తానికి నయనతార కడుపునిండిన మాటలు బాగానే మాట్లాడుతున్నట్టుగా ఉంది!

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!