అతడు మన టాలీవుడ్ ఓటీటీ హీరో

ఓటీటీలోకి రావాలా వద్దా, తమ సినిమాల్ని ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఏకంగా ఒక హీరో నుంచి 2 సినిమాలు ఓటీటీకి రావడం చెప్పుకోదగ్గ విశేషమే. ఆ హీరోనే సత్యదేవ్. ఇతడు…

ఓటీటీలోకి రావాలా వద్దా, తమ సినిమాల్ని ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఏకంగా ఒక హీరో నుంచి 2 సినిమాలు ఓటీటీకి రావడం చెప్పుకోదగ్గ విశేషమే. ఆ హీరోనే సత్యదేవ్. ఇతడు నటించిన 2 సినిమాలు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒకటి 47 డేస్, ఇంకోటి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.

టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఓవైపు కీలకమైన పాత్రలు పోషిస్తూనే, మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. జ్యోతిలక్ష్మి సినిమాతో బ్రేక్ అందుకున్న ఈ నటుడు.. 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల్లో హీరోగా నటించాడు.

47 డేస్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కు రాగా.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైంది. వీటికంటే ముందు ఇతడు హీరోగా నటించిన బ్లఫ్ మాస్టర్ అనే సినిమా వెబ్ లో మంచి ఆదరణ పొందింది. రెమ్యూనరేషన్ కూడా అందుబాటులో ఉండడంతో ఇతడితో సినిమాలు చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ వడివడిగా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాడు. వివేక్ ఒబరాయ్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటులు కూడా ఓటీటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అమితాబ్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అక్షయ్ కుమార్ సినిమా (లక్ష్మీబాంబ్) త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇప్పుడీ దిశగా తెలుగు నుంచి సత్యదేవ్ ఓటీటీకి కేరాఫ్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

లోకేష్ ని చూస్తే వణుకు వచ్చేస్తుంది

కత్తి మహేష్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ