మా సినిమా థియేటర్ లోనే వేస్తాం…అంటూ పలువురు నిర్మాతలు, డైరక్టర్లు కబుర్లు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సరైన రేటు వస్తే చాలు ఓటిటి కి ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. కాదు రెడీ అయిపోయారు. దాదాపు 80 నుంచి 90 శాతం ఫినిష్ అయిన ప్రతి పెద్ద చిన్న సినిమా ఇప్పుడు ఓటిటితో డీల్ కోసం కిందా మీదా అవుతున్నట్లు టాలీవుడ్ బోగట్టా.
దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఇలా వున్నాయి. ఉప్పెన, వి, నిశ్శద్దం, రెడ్, క్రాక్, సోలో బతుకే సో బెటరు, ఒరేయ్ బుజ్జిగా సినిమాలు అన్నీ దాదాపు పూర్తయి పోయి, పది శాతం వర్క్ పెండింగ్ వుంది అనే సిట్యువేషన్ లో వున్నాయి. వీటిలో ఒక్క ఉప్పెన మినహా అన్నీ ఓటిటి ప్రయత్నాల్లో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
క్రాక్, సోలో బతుకే సో బెటరు సినిమాలు జీ 5 తో డిస్కషన్లలో వున్నాయని బోగట్టా. వరల్డ్ నెగిటివ్ రైట్స్ తీసుకునే పద్దతితో డిస్కషన్లు జరుగుతున్నాయని అంటున్నారు. మిగిలిన సినిమాలు అన్నీ కూడా అమెజాన్ ప్రయిమ్ తో డిస్కషన్ లో వున్నాయి. కానీ ఓటిటి లు తెలుగు సినిమాల విషయంలో అంత ఫాస్ట్ గా రెస్పాండ్ కావడం లేదని తెలుస్తోంది.
పైగా ఒరేయ్ బుజ్జిగా పక్కన పెడితే మిగిలిన సినిమాలు అన్నీ 25 కోట్లు ఆ పైన రేటు వస్తే తప్ప ఇచ్చే సినిమాలు కాదు. దాదాపు మీడియం సినిమాలు అన్నీ 20 కోట్లు థియేటర్, 10 నుంచి పది హేను కోట్లు నాన్ థియేటర్ వస్తుంది అనుకుంటే ముఫై అయిదు కోట్ల రెవెన్యూ. అంటే కనీసం పాతిక, ముపై కోట్లు ఇవ్వకుండా ఓటిటి కి ఇవ్వలేరు. ఇదే పెద్ద సమస్య. వి సినిమా అయితే నలభై కోట్లు అయినా రావాల్సి వుంటుంది.
ఇవన్నీ అలా వుంచితే ఓటిటికి ఇవ్వాలంటే సవాలక్ష లీగల్ ప్రోజీజర్లు వుంటాయి. ప్రపోజల్, రూల్స్ డాక్యుమెంట్, విడుదల డేట్ ఇవన్నీ అయిన తరువాత, అప్పుడు అగ్రిమెంట్, పేమెంట్. ఇదంతా చాలా టైమ్ పడుతుంది. అందుకే ఓటిటి సినిమాలు వార్తల్లోనే ఎక్కువ కాలం నానుతున్నాయి.