మంచి దర్శకుడిగా, అంతకు మించి మంచి మాటల రచయితగా కొరటాల శివకు పేరు వుంది. భావోద్వేగ సన్నివేశాలు బాగా పండిస్తారు. అయితే కామెడీ విషయంలో ఆయన సామర్థ్యం ఏమిటన్నది ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు అన్నీ, సీరియస్ మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే కావడం వల్ల.
కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నారు. తన సినిమాల్లో కొంతయినా కామెడీ లేకుండా మెగాస్టార్ ఒప్పుకోరు. పైగా మెగాస్టార్ కామెడీ టైమింగ్ అల్టిమేట్ గా వుంటుంది. కానీ దాన్ని కొరటాల శివ మ్యాచ్ కాగలరా అనేదే డౌట్.
బహుశా అందుకే కావచ్చు, ఆచార్య సినిమాకు శ్రీధర్ సీపాన డైలాగులు సాయం పడుతున్నారట. ఈ విషయాన్ని శ్రీధర్ సీపానే స్వయంగా వెల్లడించారు. ఆచార్య సినిమా స్క్రిప్ఠ్ వర్క్ లో తాను పంచుకుంటున్నా అని. ఎమోషన్ పార్ట్ లో కొరటాలకు ఎవరి అవసరం లేదు. శ్రీధర్ సీపాన పట్టు అంతా కామెడీ మీదనే.
అంటే ఆచార్య సినిమాకు కామెడీ ట్రాక్ వ్యవహారం అంతా శ్రీధర్ సీపానకు అప్పగించేసారు అనుకోవాలి. ఇది క్లిక్ అయితే ఇక కొరటాల సినిమాలు అన్నింటికీ శ్రీధర్ సీపాన పర్మనెంట్ కామెడీ ట్రాక్ రైటర్ అయిపోతారేమో?