మళ్లీ ‘శతధృవంశ యోధుడు’

ఆర్ ఆర్ ఆర్ సినిమా అప్ డేట్స్ ఒక్కొక్కటీ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మరో అప్ డేట్. ఈ సినిమాలో ఇద్దరు హీరో ఎంట్రీ సీన్లు అద్భుతంగా రాబోతున్నాయన్న సంగతి…

ఆర్ ఆర్ ఆర్ సినిమా అప్ డేట్స్ ఒక్కొక్కటీ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మరో అప్ డేట్. ఈ సినిమాలో ఇద్దరు హీరో ఎంట్రీ సీన్లు అద్భుతంగా రాబోతున్నాయన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఎంట్రీ పులి ఫైట్ తో వుంటుందన్న సంగతి వెల్లడించాం.

ఇక చరణ్ ఎంట్రీ ఎలా వుండబోతోంది అంటే, వంద మందితో భారీ ఫైట్ మాదిరిగా వుంటుందని తెలుస్తోంది. మగధీరలో వంద మందిని చంపికానీ చావని యోధుడి వంశం అంటూ దర్శకుడు రాజమౌళి ఓ మ్యాజిక్ పాయింట్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో కూడా వంద మందితో పోరాడి గెలిచిన వీరుడిగా, ఇంట్రడక్షన్ సీన్ తీస్తున్నట్లు బోగట్టా. ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ కు ఇద్దరు హీరోల ఎంట్రన్స్ లు ప్రత్యేకంగా డిజైన్ చేసారట దర్శకుడు రాజమౌళి.

బాహుబలి రికార్డులు కొట్టాలని సైరా, సాహో ప్రయత్నించాయి కానీ విజయం సాధించలేకపోయాయి. మళ్లీ తను క్రియేట్ చేసిన బాహుబలి రికార్డులను దర్శకుడు రాజమౌళి తానే బ్రేక్ చేసే విధంగా ఆర్ ఆర్ ఆర్ ను ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

‘సైరా నరసింహారెడ్డి’ వాస్తవికత ఎంతంటే!