జగన్ పై గుర్రుగా ఉన్న రెవెన్యూ వర్గాలు

రాష్ట్రం ఏదైనా రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో అవినీతి వేళ్లూనుకుపోయింది. ఆ అవినీతిని ఓ పట్టాన తొలిగించడం సాద్యంకాదు, అలాగని రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటే ఉద్యోగులు చేసే రాద్ధాంతం మామూలుగా ఉండదు. ప్రస్తుతం…

రాష్ట్రం ఏదైనా రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో అవినీతి వేళ్లూనుకుపోయింది. ఆ అవినీతిని ఓ పట్టాన తొలిగించడం సాద్యంకాదు, అలాగని రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటే ఉద్యోగులు చేసే రాద్ధాంతం మామూలుగా ఉండదు. ప్రస్తుతం తెలంగాణలో ఇదే జరుగుతోంది. అయితే వైఎస్ జగన్ చాలా తెలివిగా గ్రామ సచివాలయాలతో రెవెన్యూ అక్రమాలకు చెక్ పెట్టారు.

గతంలో పాస్ బుక్కుల కోసం, సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరిగేవారు ప్రజలు. ఇప్పుడు సచివాలయాల్లో ఏ పని అయినా 72 గంటల్లో జరిగి తీరాల్సిందే, చేయకపోతే ఎందుకు చేయలేదో వివరణ ఇవ్వాలి. ఇలాంటి పారదర్శక వ్యవస్థతో రెవెన్యూ ఉద్యోగుల అక్రమాలకు కళ్లెం పడినట్టయింది. దీనితో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వోల)కు మరో పెద్ద సమస్య వచ్చిపడింది.

ఓవైపు ఆదాయానికి గండిపడటం, మరోవైపు తమతో సమానమైన కేడర్లో ఉన్న పంచాయతీ సెక్రటరీ కింద పనిచేయాల్సి రావడంతో వీఆర్వోలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సచివాలయాల్లో పనిచేయాల్సి వచ్చినా, తమ కేడర్ తగ్గకుండా చూడాలని ఇటీవలే రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వినతిపత్రం అందించాయి.

అయితే అలా కలిసిన రెండు రోజులకే.. వీఆర్వోలంతా పంచాయతీ సెక్రటరీల కింద పనిచేయాలని జీవోజారీ చేసి షాకిచ్చారు జగన్. తనముందు తోకజాడిస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు. అయితే ఇటీవల రెవెన్యూ వాట్సాప్ గ్రూపుల్లో ఈ సమస్యపై పెద్ద మథనమే జరుగుతోందని తెలుస్తోంది. జగన్ రెవెన్యూ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, వీఆర్వోల పొట్టకొడుతున్నారని తిట్టిపోస్తున్నారు.

దీంతో వైసీపీ సానుభూతిపరులైన ఉద్యోగులకు ఉక్రోషం వస్తోంది. తమ నాయకుడిని కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయితే ఈ విషయాన్ని వారు కూడా గోప్యంగా ఉంచారని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, గ్రూపులు కట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది.

లంచాలకు అలవాటు పడ్డ రెవెన్యూ వర్గాలు, ప్రజలకు మేలు జరిగే పథకాలను వ్యతిరేకిస్తూ కాలం గడపాలని చూస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థకు సహాయ నిరాకరణ చేసేందుకు కూడా కొంతమంది వెనకాడ్డంలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ ధిక్కార స్వరాలను ఓ కంట కనిపెట్టడం మంచిది. లేకపోతే సచివాలయ వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 

సినిమా వస్తేనే.. యోధుడు గుర్తుకు వచ్చాడు!