కాస్త గ్యాప్ తరువాత ఉన్నట్లుండి వీడియో వదలి సంచలనం సృష్టించారు పొలిటీషియన్ గా మారిని నటుడు శివాజీ. ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి టార్గెట్ గా సంచలన నిజాలు, రుజువులు, సాక్ష్యాలు బయట పెడతానంటూ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. అంతా ప్రశాంతంగా వుందనుకున్న సమయంలో శివాజీ మళ్లీ ఈ వీడియో వదలడం కాస్త సంచలనమే అయింది. ఆంధ్రలో రివర్స్ టెండరింగ్ జరిగి మెగా సంస్థకు అనుకూలంగా టెండర్ రావడం, ఒక పక్క హుజుర్ నగర్ ఉపఎన్నిక, అలాంటి టైమ్ లో కాళేశ్వర ప్రాజెక్టు గురించి మాట్లాడతానని శివాజీ అనడం వంటివి కాస్త సంచలనమే అయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో టీవీ 9 మాజీ సిఇఓ రవిప్రకాష్ పై ఫిర్యాదు రావడం, వున్నట్లుండి అరెస్ట్ కావడం వంటి వ్యవహారాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు శివాజీ పరిస్థితి ఏమిటి? మరి ఆయన నుంచి వీడియోలు వస్తాయా? అన్నది ప్రశ్న. ఎందుకంటే రవిప్రకాష్ ఓ వ్యక్తి కాదని, వ్యవస్థ అని, ఆయన రకరకాలుగా పావులు కదిపి, ఆయా మాధ్యమాలు లేదా జనాల ద్వారా తనకు కావాల్సిన సమాచారం జనాల్లోకి వదులుతారని టాక్ వుంది.
స్వంత వెబ్ మీడియా వుంది. కొన్ని వెబ్ మీడియాలతో అనుబంధం వుంది. కొంతమంది పొలిటికల్ కామెంటేటర్ లతో అనుబంధం వుంది. ఇక శివాజీ లాంటి వాళ్లు ఆయనకు చాలామందే వున్నారని టాక్. ఈ నేపథ్యంలో కనీసం బెయిల్ వచ్చేవరకు అయినా రవిప్రకాష్ వర్గం సైలంట్ గా వుంటుంది అనుకోవాలి. వినపిస్తున్న గుసగుసల సారాంశం కూడా అలాగే వుంది. ఈ అరెస్ట్ ద్వారా రవిప్రకాష్ ఆడించే బొమ్మలకు గట్టి హెచ్చరిక వెళ్లిందని. చూడాలి ఓ వారం ఆగితే వ్యవహారాలు ఎలా వుంటాయో?