ఇన్నాళ్లూ ఆమె సినిమా ప్రచారానికి రాదంటూ అనేకమంది విమర్శలు చేశారు. కోట్ల రూపాయల్లోపారితోషకం తీసుకుంటుందని, తీరా ఆ సినిమా ప్రమోసనల్ యాక్టివిటీస్ కు మాత్రం హాజరు కాదని అనేకమంది అభియోగాలు మోపారు. స్టార్ హీరోలను కూడా నయనతార పట్టించుకోదంటూ విశ్లేషించారు. అలాంటి మాటలన్నింటికీ చెక్ పెట్టేందుకు, ఇకపై తనను ఎవరూ సినిమాల ప్రమోషనల్ యాక్టివిటీస్ కు పిలవకుండా ఉండేందుకు నయనతార ఒక అస్త్రాన్ని వదిలింది.
అదేమిటంటే.. తను ఏ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాలుపంచుకున్నా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నయనతార లీక్ ఇచ్చిందట. ఇదివరకూ ఒక సినిమా ఆడియో రిలీజ్ వేదికకు తను వెళ్లానని, ఆ సినిమాలో నటించినందుకు గానూ అలా ప్రమోషన్ చేసినట్టుగా నయనతార చెప్పింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందని, ఆ తర్వాత తను ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాలుపంచుకోని సినిమాలు ఒక్కొక్కటిగా హిట్ అవుతూ వస్తున్నాయని నయనతార చెబుతోందట.
అందుకే తను కొన్నేళ్లుగా ఏ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదని ఈ హీరోయిన్ చెబుతోందట. ఈ లీక్ చాలు.. ఈమెతో సినిమాలు చేసే వారెవరూ ఒక ఆ సినిమాల ప్రమోషన్ కు రమ్మని పిలవరు. తనువస్తే సినిమా ఫట్ అవుతుందని ఆమే చెబితే, ఇక ఆమెను ప్రచార కార్యక్రమాలకు పిలిచేవారు ఎవరుంటారు? అసలే ఇండస్ట్రీ అంటే బోలెడన్ని సెంటిమెంట్లతో నడిచే పరిశ్రమ. అలాంటిది నయనతారను పిలిచే సాహసం ఎవరైనా చేస్తారా?