వెంకీ, ప‌వ‌న్.. ఆ సీక్వెల్ నూ రీమేక్ చేస్తారా?

సీక్వెల్ సినిమాలు..బాలీవుడ్ లో కాస్త సులువైన వ్యాపారం. క‌థ‌తో సంబంధం ఉన్నా లేక‌పోయినా.. పార్ట్ 2 అంటే చాలు ప‌నైపోయిన‌ట్టే! ఇక తెలుగులో రీమేక్ లు చాలా రొటీన్ అయిపోయాయి. స్టార్ హీరోలు వ‌ర‌స…

సీక్వెల్ సినిమాలు..బాలీవుడ్ లో కాస్త సులువైన వ్యాపారం. క‌థ‌తో సంబంధం ఉన్నా లేక‌పోయినా.. పార్ట్ 2 అంటే చాలు ప‌నైపోయిన‌ట్టే! ఇక తెలుగులో రీమేక్ లు చాలా రొటీన్ అయిపోయాయి. స్టార్ హీరోలు వ‌ర‌స పెట్టి రీమేక్ సినిమాల‌నే ఎంచుకుంటున్నారు తెలుగునాట‌. ఆఖ‌రికి ఓటీటీలో మాత్ర‌మే విడుద‌లైన సినిమాల‌ను కూడా రీమేక్ చేసి త‌మ ముచ్చ‌ట తీర్చుకుంటున్నారు టాలీవుడ్ స్టార్లు! 

ఈ క్ర‌మంలో వీళ్ల ఆస‌క్తికి త‌గ్గ‌ట్టుగా ఆల్రెడీ రీమేక్ అయిన సినిమాలకు సీక్వెల్స్ వ‌స్తున్నాయి. దృశ్యం రీమేక్ త‌ర్వాత‌, వ‌ద‌ల‌కూడ‌ద‌న్న‌ట్టుగా దృశ్యం 2 ను వెంక‌టేష్ రీమేక్ చేశారు. తెలుగులో రీమేక్ ల ప‌ట్ల బాగా ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించే హీరోలు వెంక‌టేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్. ఈ క్ర‌మంలో వీరికి మ‌రో ఛాయిస్ రెడీ అవుతోంది. అదే ఓ మై గాడ్ పార్ట్ 2. 

ఈ సీక్వెల్ పార్ట్ కు సంబంధించి ఒక్కొక్క‌టీ సెట్ అవుతున్నాయి. ఇప్ప‌టికే స్క్రిప్ట్ రెడీన‌ట‌. అక్ష‌య్ కుమార్  కూడా ఓకే అని, రెండో పార్ట్ లో ప‌రేష్ రావ‌ల్ ఉండ‌టం లేద‌ని, ఆయ‌న స్థానంలో పంక‌జ్ త్రిపాఠిని తీసుకొస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. భారీ స్థాయిలో రెమ్యూనిరేష‌న్ అడ‌గ‌డంతో ప‌రేష్ ను ప‌క్క‌న పెట్టి, పంక‌జ్ త్రిపాఠిని తీసుకున్నార‌ని స‌మాచారం. 

మ‌రి హిందీలో ఓ మై గాడ్  పార్ట్ 2 వ‌స్తే.. తెలుగులో కూడా అది రీమేక్ అయ్యే అవ‌కాశాలున్న‌ట్టే. ఎలాగూ ఫ‌స్ట్ పార్ట్ తెలుగులో కూడా గిట్టుబాటు అయిన నేప‌థ్యం.. రీమేక్ ల ప‌ట్ల వెంకీ, ప‌వ‌న్ ల‌కు త‌గ‌ని మోజు నేప‌థ్యం..ఈ రీజన్ల‌తో హిందీ వెర్ష‌న్ ను కూడా తెలుగులో రీమేక్ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్టే!