రవిప్రకాష్ పై వంద కోట్ల అబియోగం

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ పై ఏకంగా వంద కోట్ల అబియోగం వచ్చినట్లు వార్తలు సూచిస్తున్నాయి. రవిప్రకాష్ ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. Advertisement టివి9 యాజమాన్యం తరపున ప్రస్తుత సిఎఫ్…

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ పై ఏకంగా వంద కోట్ల అబియోగం వచ్చినట్లు వార్తలు సూచిస్తున్నాయి. రవిప్రకాష్ ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

టివి9 యాజమాన్యం తరపున ప్రస్తుత సిఎఫ్ ఓ గొట్టి పాటి సింగరావు పోలీసులకు పిర్యాదు చేశారు. గత రెండు, మూడేళ్లలో రవిప్రకాష్ , అప్పటి ఫైనాన్స్ అధికారి మూర్తి కలిసి ఈ మొత్తాన్ని స్వాహా చేశారని యాజమాన్యం ఆరోపించి, అందుకు సంబంధించిన ఆదారాలు సమర్పించింది.

బోనస్‌, ఎక్స్‌గ్రేషియా పేరుతో కంపెనీ నిధులను స్వలాభానికి వాడుకుని.. సంస్థకు నష్టం కలిగించినట్టు ఫిర్యాదు పేర్కొన్నట్టు వెల్లడించారు.

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, షేర్‌ హోల్డర్ల ఆమోదం తీసుకోకుండా కంపెనీ ఖాతా నుంచి నిధులను తీసుకుని స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు.

రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. రవిప్రకాశ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని డీసీపీ సుమతి చెప్పారు.