వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన “పవర్‌స్టార్” షార్ట్ ఫిల్మ్‌కు వ్యతిరేకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వంలో “పరాన్నజీవి” అనే మరో వెబ్‌సిరీస్ తీశారు. ఇంకా వర్మను టార్గెట్ చేస్తూ మరికొన్ని వెబ్ సిరీస్‌లు వేగంగా షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి.
పరాన్నజీవి దర్శకుడు నూతన్‌నాయుడు “గ్రేటాంధ్ర” యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన వర్మ, శ్రీరెడ్డి మధ్య సత్సంబంధాలపై కూడా మాట్లాడారు. తనకు పరాన్నజీవిలో నటించాలని ఆఫర్ చేశారని నటి శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాన్నజీవిలో శ్రీరెడ్డి పాత్రపై నూతన్‌నాయుడు ఏమన్నారో తెలుసుకుందాం.
“ఇంతకూ మీ సినిమా నుంచి శ్రీరెడ్డి ఎందుకు తప్పుకున్నట్టు?” అనే యాంకర్ ప్రశ్నకు నూతన్‌నాయుడు స్పందిస్తూ….సినిమాలోకే శ్రీరెడ్డి రాలేదన్నారు. నటించాలని ఆమెను అడిగామన్నారు. తనకు ఒక చక్కని పాత్ర ఉందని తానే శ్రీరెడ్డితో మాట్లాడి ఆఫర్ చేసినట్టు నూతన్‌నాయుడు తెలిపారు. తను ఆ పాత్ర చేస్తే…సముచితమైన గుర్తింపు లభిస్తుందని అనుకున్నామన్నారు.
అయితే శ్రీరెడ్డి వ్యక్తగత కారణాల వల్ల చెన్నైలో ఉంటున్నట్టు చెప్పారు. చెన్నైలో కరోనా కాస్తా ఎక్కువగా ఉండడం, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాలన్నా వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమన్నారు. అందులోనూ పరాన్నజీవి షూటింగ్‌కు తక్కువ సమయం ఉండిందన్నారు. అన్నీ ఆలోచించి ఆమె తన నిర్ణయం చెప్పారని, తాము కూడా యాక్సప్ట్ చేసినట్టు నూతన్‌నాయుడు తెలిపారు.
కానీ తనకు కొన్నివిలువలున్నాయని, తాను అభిమానించే వాళ్లకు వ్యతిరేకంగా తీసే సినిమాలో నటించనన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంకర్ అంతేనా లేకపోతే ఆవిడకు, వర్మకు ఉన్న సత్సంబంధాల కారణంగా కుదర్లేదా అని ప్రశ్నించారు. దీనికి నూతన్ సమాధానమిస్తూ… వర్మతో శ్రీరెడ్డి సంబంధాలు, సత్సంబంధాల గురించి చెప్పలేనన్నారు. ఎందుకంటే తన సినిమాలోని వర్మ గారి క్యారెక్టర్ శ్రీరెడ్డి నిజరూపమని చెప్పారు. నూతన్ నిజరూపంలోని లోగుట్టును ఎలా అర్థం చేసుకోవాలో మరి?