మెగా ఫ్యాన్స్ డీలా

మొత్తానికి 2023 సంక్రాంతి సినిమాల డేట్ లు వచ్చేసాయి. 11 అజిత్ వాలిమై సినిమా..12 విజయ్ వారసుడు..బాలయ్య వీరసింహారెడ్డి, 13న వాల్తేర్ వీరయ్య ఫిక్స్ అయిపోయాయి. అన్నింటికన్నా వెనుక రావాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారని…

మొత్తానికి 2023 సంక్రాంతి సినిమాల డేట్ లు వచ్చేసాయి. 11 అజిత్ వాలిమై సినిమా..12 విజయ్ వారసుడు..బాలయ్య వీరసింహారెడ్డి, 13న వాల్తేర్ వీరయ్య ఫిక్స్ అయిపోయాయి. అన్నింటికన్నా వెనుక రావాలని మెగాస్టార్ డిసైడ్ అయ్యారని ముందుగానే వెల్లడించాం. ఆ విధంగానే 13 డేట్ అని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. దీంతో ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఫీల్ అవుతున్నారు.

తొలి రోజు రికార్డులు అన్నది ఇక అసాధ్యం అని వారి ఆవేదన. సోలోగా ఎక్కువ థియేటర్లు పడితే రికార్డులు వస్తాయి. కానీ ఇప్పుడు ఏమయింది. మూడు సినిమాలతో కలిపి నాలుగో సినిమాగా మిగిలింది. 

గమ్మత్తేమిటంటే పెద్దగా హడావుడి చేయని అజిత్ వాలిమై సినిమాకు సోలో డేట్ దక్కింది. 11న ఆ సినిమా కనుక వుంటే మొత్తం థియేటర్లు పడతాయి. 12న బాలయ్య సినిమా విజయ్ వారసుడు సినిమాతో స్క్రీన్ లు షేర్ చేసుకోవాల్సి వుంటుంది. నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమా కోసం ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేసారని వార్తలు వున్నాయి. అందువల్ల బాలయ్యకు కూడా పెద్దగా రికార్డులు దక్కవు.

ఆ తరువాత మెగాస్టార్ సినిమా వస్తోంది. ముగ్గురితో కలిసి స్క్రీన్ లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల మరీ సమస్య. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ గా డీలా పడ్డారు.