రాను రాను సినిమా ట్రెండ్ మారుతోంది. బడ్జెట్ మారుతోంది. ఇలాంటి టైమ్ లో సినిమా నిర్మాణ వ్యవహారాలు కూడా మారాలి. హీరోలు కూడా నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే డిఫరెంట్ సినిమాలు వస్తాయి. ఇది అందరూ చెప్పే మాటే. కానీ ఆచరణ కాస్త తక్కువ.
లేటెస్ట్ గా టీజర్ బయటకు వదిలిన విరూపాక్ష సినిమా ఇదే సూత్రంతో తయారవుతోంది. దర్శకుడు సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై, తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘విరూపాక్ష’ సిన్మా ప్లాన్ చేసారు. దీనికి భోగవిల్లి ప్రసాద్ కూడా భాగస్వామిగా చేరారు. ఆపై హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చేతులు కలిపారు.
అంటే లాభ నష్టాలు ఏవైనా ముగ్గురివీ అన్నమాట. పెట్టుబడి, నిర్మాణ నిర్వహణ భోగవిల్లి బాపినీడు చూసుకుంటారు. బ్లాక్ మ్యాజిక్, హర్రర్, థ్రిల్లర్ జోనర్ లో తయారవుతున్న సినిమా ఇది. ఇప్పటికి అరవై శాతం పూర్తయింది. సమ్మర్ టార్గెట్ గా రెడీ అవుతున్న విరూపాక్ష టీజర్ ను విడుదల చేసారు. ఈ మధ్య కాస్త ఎగస్ట్రా లార్జ్ కంటెంట్ వుంటే తప్ప జనం సినిమా పై ఆసక్తి పెంచుకోవడం లేదు.
ఆ క్రమంలో చూస్తే విరూపాక్ష అట్రాక్షన్ గ్రాబింగ్ కంటెంట్ తో వస్తున్నట్లే కనిపిస్తోంది. కాంతారా సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోకేష్ సంగీతం అందించడం అన్నది టీజర్ కు ప్లస్ అయింది. ఎన్టీఆర్ వాయిుస్ ఓవర్ లో శాస్త్రానికి అందని సత్యం గురించిన కంటెంట్ సినిమాలో వుంటుందని క్లారిటీ వచ్చింది.