దర్శకుడు ఆర్జీవీ దగ్గర చాలా పెద్ద జాబితానే వుంది. రకరకాల విషయాలపై సినిమాలు తీయాలని ఆయన ప్లాన్ చేసి పెట్టుకున్నారు. వన్ బై వన్ తీసుకుంటూ వెళ్తున్నారు. రాయలసీ మ ఫ్యాక్షనిజం నుంచి బెజవాడ రౌడీయిజం మీదగా ఎన్టీఆర్ వరకు పెద్ద తెరమీద సినిమాలు అందించారు. ఇప్పుడు ఆన్ లైన్ లోకి వచ్చారు. పవర్ స్టార్ అంటూ హీరో పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసి వదిలారు. దాని తరువాత అమృత-మారుతీరావ్ సంఘటన ఆధారంగా సినిమా తీసి వదుల్తున్నారు.
ఇలా వర్మ పెట్టుకున్న జాబితాలో బాలకృష్ణ ఇంటి కాల్పుల సంఘటన కూడా వుందని టాక్. అది వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో అన్నది తెలియదు కానీ, 'అల్లు-బావ-బావమరిది' అనే సినిమా ఒకటి ప్లానింగ్ లో వుందని తెలుస్తోంది. మెగాస్టార్- అల్లు అరవింద్, ప్రజారాజ్యం వ్యవహారాల నేపథ్యంలో ఈ సినిమా వుండే అవకాశం వుందని తెలుస్తోంది.
ప్రజారాజ్యం ఫెయిల్యూర్ లో అల్లు అరవింద్ కు కూడా భాగస్వామ్యం వుందని గ్యాసిప్ లు వున్నాయి. మరి వర్మ ఏ యాంగిల్ లో అల్లు అరవింద్ ను టచ్ చేయబోతున్నారో తెలియదు. జాబితాలో అయితే ఈ సబ్జెక్ట్ కూడా వుందని వర్మ సన్నిహిత వర్గాల బోగట్టా. కేవలం విషయం ఇంట్రస్ట్ గా వుంటుందనా? లేక తన పవర్ స్టార్ సినిమా శ్రేయాస్ ఎటిటి లో విడుదల కాలేకపోవడానికి కారణం అల్లు అరవింద్ క్యాంప్ అనే కోపంతోనా? అన్నది మాత్రం సమాధానం తెలియని ప్రశ్న. కానీ ఈ సినిమా కూడా శ్రేయాస్ కు సమస్యే. ఈ సినిమాను కూడా తన శ్రేయాస్ ఇటి లో ప్రదర్శించలేరు ఎలాగూ.