ఇన్నాళ్లు గ్యాసిప్ ల్లో వుంటూ వస్తున్న దుల్కర్ సల్మాన్-హనురాఘవపూడి సినిమా ఫిక్స్ అయింది. ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తున్నారు. స్వప్న సినిమా పతాకంపై నిర్మించే ఈ సినిమా వైజయంతీ మూవీస్ సమర్పిస్తుంది. ప్రియాంకదత్ నిర్మాతగా వ్యవహరిస్తారు. లై లాంటి థ్రిల్లర్, పడి పడి లేచె మనసు లాంటి లవ్ స్టోరీ లు అందించిన హను రాఘవపూడి అందించిన కథకు ముచ్చటపడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
హను రాఘవుపూడి కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాపుల తరువాత ఎలాగైనా హిట్ కొట్టి తీరాలనే ప్రయత్నంలో ఈ కథ రెడీ చేసుకున్నారు. షూటింగ్ లు మొదలయ్యే లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేసి, సెట్ మీదకు వెళ్తారు. షూటింగ్ లు ప్రారంభం కాగానే వీలయినంత ఫాస్ట్ గా సినిమాను పూర్తి చేయాలన్నది ఆలోచన.