షాక్‌కు గుర‌య్యానంటున్న సింగ‌ర్ సునీత‌

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిత్యం ర‌క‌ర‌కాలుగా మోసాలు జ‌రుగుతున్నా…కొంచ‌మైనా ఆలోచించ‌రా? అని సింగ‌ర్ సునీత ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా త‌న పేరుతో ఓ వ్య‌క్తి డ‌బ్బు వ‌సూలు చేస్తున్నాడ‌నే విష‌యం తెలిసి ఆమె షాక్‌కు గుర‌య్యారు. దీంతో…

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిత్యం ర‌క‌ర‌కాలుగా మోసాలు జ‌రుగుతున్నా…కొంచ‌మైనా ఆలోచించ‌రా? అని సింగ‌ర్ సునీత ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా త‌న పేరుతో ఓ వ్య‌క్తి డ‌బ్బు వ‌సూలు చేస్తున్నాడ‌నే విష‌యం తెలిసి ఆమె షాక్‌కు గుర‌య్యారు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె క్లారిటీ ఇచ్చారు.

తాను సింగ‌ర్ మేన‌ల్లుడిని అని చెప్పి చైత‌న్య అనే వ్య‌క్తి సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తానంటూ డ‌బ్బు వ‌సూలు చేస్తున్నాడు. ఈ విష‌యం సింగ‌ర్ సునీత‌కు తెలిసింది. దీంతో ఆమె ఫేస్‌బుక్‌లో క్లారిటీ ఇచ్చారు. త‌న‌కు చైత‌న్య పేరుతో ఎవ‌రూ మేన‌ల్లుడు లేర‌న్నారు. ఇంకా ఆమె ఏమ‌న్నారంటే…

‘ఇటీవ‌ల నా పేరుతో జ‌రుగుతున్న మోసంపై  క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చైతన్య అనే అతను నా మేనల్లుడు అని చెప్పి, ప్ర‌ముఖుల‌తో పరిచయాలు పెంచుకుంటున్నాడని తెలిసింది. అంతేకాదు, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని కూడా తెలిసింది. ఇది తెలిసి నేను షాక్ అయ్యాను. నాకసలు  చైతన్య అనే మేనల్లుడు లేనే లేడు. దయచేసి ఇకపై ఎవరూ మోసపోకండి. మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా చెబుతున్నాను.

అయినా ప్రతి రోజూ ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు వార్తలు వ‌స్తున్నా….మ‌ళ్లీమ‌ళ్లీ  ఎలా మోసపోతున్నారు?  కొంచమైనా ఆలోచించరా? ’ అని సునీత తెలిపారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

త‌ప్పంతా నాదే…రోజా నాకు అక్క లాంటిది