మాట నిలబెట్టుకున్న జగన్?

మాట ఇస్తే తప్పనని జగన్ అంటారు. అది నిలబట్టుకోవడంలోనూ ఆయన చూపుతున్న నిబధ్ధత కూడా ఎపుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. ఉత్తరాంధ్రా జిల్లాల‌కు ఒక గిరిజన విశ్వ విద్యాలయం విభజన చట్టం ప్రకారం మంజూరు…

మాట ఇస్తే తప్పనని జగన్ అంటారు. అది నిలబట్టుకోవడంలోనూ ఆయన చూపుతున్న నిబధ్ధత కూడా ఎపుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. ఉత్తరాంధ్రా జిల్లాల‌కు ఒక గిరిజన విశ్వ విద్యాలయం విభజన చట్టం ప్రకారం మంజూరు అయింది.

అయితే అయిదేళ్ళ టీడీపీ పాలనలో గిరిజన వర్శిటీ వూసు పెద్దగా వినిపించలేదు. అంతే కాదు, దానికి తీసుకుపోయి మైదాన ప్రాంతంలో పెట్టాలన్న కుటిల  ప్రయత్నం కూడా జరిగింది. కానీ జగన్ తన పాదయాత్ర సమయంలో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోనే గిరిజన వర్శిటీని తీసుకువస్తామని గట్టిగా హామీ ఇచ్చారు.

దాని ప్రకారం ఇపుడు అక్కడ స్థల సేకరణ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకు  మేలు చేయాలని, వారు కోరుకున్న చోటనే వర్శిటీ ఉండాలని జగన్ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో దానికి సంబంధించి ఇపుడు చురుకుగా స్థల పరిశీలన జరుగుతోంది.

చాలా తొందరలోనే సాలూరు నియోజకవర్గంలో భూములను గిరిజన వర్శిటీని ఎంపిక చేసే కార్యక్రమం పూర్తి అవుతుంది అని అధికారులు అంటున్నారు. మంచి రోజు చూసి ఇక్కడే గిరిజన వర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. వైఎస్సార్ భక్తుడు సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర కృషి , కల కూడా తోడు అయి ఆదీవాసీలకు మేలైన వర్శిటీ రానున్న రోజుల్లో రాబోతోంది. 

మొత్తానికి ఎన్ని రాజకీయ వత్తిళ్ళు ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం సాలూరుకే జగన్ వర్శిటీ వరం ఇచ్చి అసలైన ప్రజానాయకుడు అయ్యారని వైసీపీ నేతలు కొనియాడుతున్నారు.

నా దేవుడ్ని చూస్తే మాటలు రావు

కాపీ పేస్టులు చేసేవాళ్ళు కూడా రివ్యూ రైటర్లు అయిపోయారు